టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా : ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య

టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా : ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
  • కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య

పెద్దపల్లి, వెలుగు :  ఎమ్మెల్సీగా గెలిపిస్తే టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య  అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి టౌన్ లో శనివారం గాయత్రి డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సొంత జిల్లాలో ప్రచారం చేయడం సంతోషంగా ఉందని, చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నట్లు గుర్తు చేశారు.

  టీచర్లకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ టీచర్  ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యకు  విశ్వహిందూ పరిషత్ కూడా  సంపూర్ణ మద్దతు తెలిపింది. జాతీయ భావాలు కలిగిన మల్క కొమరయ్యకు మద్దతు ఇస్తున్నామని వీహెచ్ పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్  తెలిపారు.  

అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సిద్దిపేట జిల్లా శాఖ నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా అభ్యర్థి  కొమరయ్య పాల్గొన్నారు.  బీసీ బిడ్డగా తనను గెలిపిస్తే టీచర్ల సమస్యల పరిష్కారానికి ముందుండి కొట్లాడతానని  హామీ ఇచ్చారు.  గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరు కూడా టీచర్ల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆయన ఆరోపించారు.