టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కోదాడ, వెలుగు : రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. ఫిబ్రవరి 27న జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోదాడ పట్టణంలో పలువురు ఉపాధ్యాయులను కలిశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జాక్టో సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డులు, మెరుగైన పీఆర్సీ ఇప్పించడంతోపాటు మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. 

ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భర్తీ చేయిస్తానన్నారు. సమావేశంలో ఎస్ టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఓరుగంటి నాగేశ్వరరావు, బంధం వెంకటేశ్వర్లు, కేవీ సత్యనారాయణ, ఆర్.శ్రీనివాసరావు, ఆర్సీ రెడ్డి, వెంకటేశ్వర్లు, చందులాల్, భాస్కర్, రూప్లా, ఆదినారాయణ, అంకిరెడ్డి, కాశీం  పాల్గొన్నారు. 

టీచర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం  

మిర్యాలగూడ, వెలుగు : టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ  అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మిర్యాలగూడలో జేఏసీ నేతలతో పూల రవీందర్ సమావేశమయ్యారు. సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్, పులిజాల విష్ణుకుమార్, దీరావత్ సీతారాం, అంబటి శ్రీనివాస్, మాలి సైదులు, సురేశ్ పాల్గొన్నారు.