5,600 పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలి : రఘోత్తంరెడ్డి

5,600 పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలి : రఘోత్తంరెడ్డి
  • సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైమరీ స్కూళ్ల బలోపేతానికి జీవో 11,12 సవరించి 5,600 పీఎస్ హెచ్​ఎం పోస్టులను మంజూరు చేయాలని టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బీఈడీ, డీఈడీ టీచర్లందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని విన్నవించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డితో పాటు ఆయన కలిశారు.

ప్రమోషన్లు పొందిన టీచర్లతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేయడంపై రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు చెప్పారు. దీనిలో అన్ని కేడర్ల టీచర్ల సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు డీఏలను ప్రకటించాలని కోరారు.