317 జీవో సవరించాలని డిమాండ్ చేస్తూ టీచర్ల ఆందోళన

317 జీవో సవరించాలని డిమాండ్ చేస్తూ టీచర్ల ఆందోళన

317 జీవో సవరించాలని డిమాండ్ చేస్తూ ఉదయం హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు టీచర్లు ఆందోళనకి దిగారు. కేబినేట్ సమావేశంలో తమ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. విడతల వారిగా స్కూల్ ఎడ్యుకేషన్ కి టీచర్లు తరలివస్తున్నారు. జీవో సవరించే వరకు వెనక్కి తగ్గేదేలేదంటున్నారు టీచర్లు. జీవో 317 రద్దు చేయాలంటూ  మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు టీచర్లు . వివిధ జిల్లాల నుంచి వచ్చిన టీచర్లు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో మంత్రి నివాసానికి వెళ్లారు.  స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా బదిలీలు చేయడంతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియార్టీ ఆధారంగా జిల్లాలకు సంబంధం లేని వ్యక్తులను ఇతర జిల్లాలకు పంపుతున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. 

ఇవి కూడా చదవండి: 

రేపటి నుంచి వర్చువల్ గా కేసుల విచారణ

హైదరాబాద్ కు ఫార్ములా ఈ  కార్ రేసింగ్