
సూర్యాపేట, వెలుగు : పెండింగ్వేతనం చెల్లించాలని కోరుతూ తాను చదువు చెప్పే పాఠశాల గేటు ముందు ఓ టీచర్అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్ కే స్కూల్ లో పోలుమల్లకి చెందిన టీచర్ నల్ల ఆదిరెడ్డి ఇంగ్లిష్ బోధిస్తున్నాడు. గత జూన్ లో కాలేజీలో టీచర్‌గా అతడు జాయిన్అయ్యాడు. అప్పటి నుంచి అడపాదడపాగా జీతం ఇస్తుండగా కుటుంబం గడవడం ఇబ్బందిగా మారింది.
దీంతో ఆయన మార్చి 24న స్కూల్ కి వెళ్లడం మానేసి జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్తున్నాడు. గత ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి జీతం రూ.18 వేలు ఇవ్వకపోవడంతో పాఠశాల గేటు ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం దిగివచ్చి ఈనెల 17న జీతం మొత్తం ఇస్తామని ఒప్పుకోవడంతో ఆయన ఆందోళన విరమించాడు.