పీఆర్సీపై టీచర్ల ఆగ్రహం.. త్రివేణి సంగమంలో పీఆర్సీ ప్రతుల నిమజ్జనం

పీఆర్సీపై టీచర్ల ఆగ్రహం.. త్రివేణి సంగమంలో పీఆర్సీ ప్రతుల నిమజ్జనం

జయశంకర్ జిల్లా: పీఆర్సీ సిఫార్సులపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం రోజురోజుకూ కట్టలు తెంచుకుంటోంది. ఫిట్ మెంట్ పేరుతో ముష్టి వేసే రీతిలో వ్యవహరిస్తున్నారని రగిలిపోతున్న ఉపాధ్యాయులు తమదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇవాళ ఒకడుగు ముందుకేశారు. జయశంకర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు కాలేశ్వరం త్రివేణి సంగమం లో పీఆర్సీ ప్రతులను నిమజ్జనం చేసి నిరసన నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఫిట్ మెంట్ పై ఎన్నో ఆశలు.. అంచనాలు పెట్టుకుంటే.. దాదాపు 30 నెలలు ఊరించి.. ఊరించి కొండను తవ్వి ఎలుకను పట్టిచ్చినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫిట్ మెంట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా ఒక్కటేనని వారు పేర్కొన్నారు. 2018లో ఉన్న ధరల ప్రకారం బిశ్వాల్ కమిటీ 7.5 శాతం రిఫర్ చేసిందని గుర్తు చేస్తూ.. ఇప్పుడు నిత్యావసరాల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. పెట్రోలు ధరలు ఆకాశానికి ఎగబాకాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల జీతాలు మాత్రం పెరగలేదని వారు తెలిపారు. 45 శాతం ఫిట్ మెంట్ ఇవ్వకుంటే ఉద్యమం చేపట్టి తీవ్రతరం చేస్తామని  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ

రాష్ట్రంలో ఆర్టీఐ యాక్ట్ బేఖాతర్ : ఇన్ఫర్మేషన్ దాస్తున్నరు!