
సిద్దిపేట రూరల్, వెలుగు: ఇర్కోడ్ మోడల్ స్కూల్‌లో గంటల ప్రాతిపదికన బోధించేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్. బుచ్చిబాబు చెప్పారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ తెలుగు, ఎకానామిక్స్, జంతు శాస్త్రం, టీజీటీ తెలుగు, ఇంగ్లీషు, హిందీ పోస్టులకు జూన్16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పీజీటీ పోస్టులకు సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్, బీ.ఎడ్ పూర్తి చేసి ఉండాలని, టీజీటీ పోస్టులకు గ్రాడ్యుయేషన్, బీ.ఎడ్ పూర్తి చేసి, టెట్ అర్హత సాధించి ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్కూల్‌లో సంప్రదించాలని సూచించారు.