సార్లు గాడి తప్పుతున్నరు : రాజన్న జిల్లాలో వరుసగా టీచర్లపై పోక్సో కేసులు

సార్లు గాడి తప్పుతున్నరు :  రాజన్న జిల్లాలో వరుసగా టీచర్లపై పోక్సో కేసులు
  • కొందరు టీచర్ల ప్రవర్తనతో పవిత్ర వృత్తికే చెడ్డపేరు 
  • ఈ ఏడాదిలో ఐదుగురు టీచర్లు జైలుపాలు
  • టీచర్ల అసభ్యప్రవర్తనతో పేరెంట్స్‌‌‌‌, విద్యార్థుల్లో ఆందోళన 

రాజన్నసిరిసిల్ల,వెలుగు: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు కొందరు గాడి తప్పుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులతో కొందరు టీచర్ల అసభ్య ప్రవర్తనతో ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో సర్కార్‌‌‌‌‌‌‌‌ టీచర్లపై పోక్సో కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. 

చాలామంది టీచర్లు విద్యార్థులను  అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తుండగా.. కొందరి తీరుతో వృత్తికే అపవాదు వస్తోంది. జిల్లాలో ఆరునెలల్లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన  ఐదుగురు టీచర్లపై పోక్సో కేసులు నమోదు కాగా జైలుకు పోవాల్సి వచ్చింది. 

వరుస ఘటనలతో కలకలం 

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో ఆరు నెలల్లో ఐదు పోక్సో కేసులు నమోదయ్యాయి. తంగళ్లపల్లి మండలంలోని ఓ స్కూల్‌‌‌‌లో పనిచేస్తున్న ఓ టీచర్ పై 9నెలల కింద పోక్సో కేసు నమోదుకాగా, మరో రెండు నెలలకు వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్ టీచర్ పై కూడా కేసు నమోదైంది. రెండు నెలల కింద గంభీరావుపేట మండలంలోని జూనియర్ కాలేజీ లెక్చరర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రెండు రోజుల కింద సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ హైస్కూల్ తెలుగు టీచర్‌‌‌‌‌‌‌‌పై పోక్సో కేసు నమోదుకాగా.. అతడిని విద్యాశాఖ సస్పెండ్‌‌‌‌ చేసింది. 

ఈ ఏడాదిలో 35 పోక్సో కేసులు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 35 పోక్సో కేసులు నమోదయ్యాయి. ర్యాంగింగ్, వేధింపులు, అత్యాచారం, అసభ్య ప్రవర్తన.. వంటి వాటిపై షీ టీం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆరోపణ వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేసి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. విద్యార్థినులతో సీక్రెట్‌‌‌‌గా మాట్లాడి సాక్ష్యాలు సేకరించి వెంటనే రిమాండ్ కు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో పోకిరీలపై 35 పోక్సో కేసులు, 44 పిట్టీ కేసులు నమోదు చేశారు. మరోవైపు షీం టీం ఆధ్వర్యంలో కాలేజీ, స్కూళ్లలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కాలేజీలు, టెంపుల్స్, ఇతర రద్దీ ప్రదేశాలలో  షీ టీంలు మఫ్టీలో తిరుగుతూ ఆకతాయిలను పట్టుకుంటున్నారు. 

స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను వేధిస్తే వదిలిపెట్టం 

విద్యార్థినులు, మహిళలను వేధించినా, వారితో అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు అందితే కేసులు నమోదుచేసి ఎంతటివారినైనా వదిలిపెట్టం. ఇప్పటికే జిల్లాలో షీ టీం ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో బ్యాడ్  గుడ్ టచ్‌‌‌‌‌‌‌‌, వేధింపులపై అవగాహన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నాం. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే నేరుగా షీ టీంకు ఫిర్యాదు చేసేలా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను మోటివేట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాం.ఎస్పీ అఖిల్ మహాజన్, రాజన్నసిరిసిల్ల జిల్లా