రంగారెడ్డి: షాద్నగర్లో ప్రభుత్వ టీచర్లు ఆందోళనకు దిగారు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లిస్టులో తమ ఓట్లు లేకపోవడంతో గత మూడు రోజులుగా ఓటు హక్కు వినియో గించుకోలేకపోతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజల్లో చైతన్యం కలిగిస్తే.. తమకే ఓటు లేకుండా చేశారని నిరసన వ్యక్తం చేశారు.
సోమవారం ఉదయం నుంచి షాద్ నగర్ ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలకు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. రేపు (నవంబఱ్ 28) ఒక్కరోజే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది.. మా ఓటు రాకపోతే కోర్టుకు వెళతామని, పోలింగ్ విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు ప్రభుత్వ టీచర్లు.