జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ హై స్కూల్లో 200 పైగా స్టూడెంట్లున్నారు. ప్రస్తుతం రోజూ వందకు పైగా స్కూల్కు వస్తున్నారు. గతంలో స్కూళ్లలో వంట చేసినవారికి సర్కారు బకాయిలు చెల్లించలేదు. దీంతో ఇప్పుడు ఎవరూ రాకపోవడంతో టీచర్లే వంట చేసి స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి వంట నిర్వాహకుల బకాయిలు చెల్లించి వారు పనిలోకి వచ్చేలా చూడాలని తల్లిదండ్రులు, టీచర్లు కోరుతున్నారు.