Teachers day Special 2024: గతంలో గురువులు.. స్కూళ్లు ఎలా ఉండేవంటే...

Teachers day Special  2024:  గతంలో గురువులు.. స్కూళ్లు ఎలా ఉండేవంటే...

ఉపాధ్యాయ దినోత్సవం ( Teachers  Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఆ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంసెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటారు.

మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము

చదువు అనంతమైంది. అందులో ఏది కావాలన్నాదొరుకుతుంది. ఈ రోజుల్లో అయితే అవసరానికి తగ్గట్టు నేర్చుకోవడానికి వందల సబ్జెక్టులున్నాయ్. అందులో ఎవరికి ఏది కావాలో ఆ సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఒకప్పుడు అలా కాదు. అందరికీ ఒకటే విద్య, ఒక్కటే గురుకులం. మరి అప్పట్లో ఏ సబ్జెక్ట్స్ నేర్పేవాళ్లు? అసలు నిజమైన విద్యలో ఏయే సబ్జెక్ట్స్ ఉంటాయి?

ఇప్పుడున్న విద్యా విధానంలో... మనిషి  పెరిగి, పెద్దయ్యే వరకూ ఒక్కో దశలో ఒక్కో గురువు మారుతూ ఉంటాడు.   ప్రతీ ఒక్కరూ ఒక్కో విషయం నేర్పుతూ వ్యక్తిని సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో సాయపడతారు. అయితే ఇప్పటి స్కూల్స్ లాగానే ఒకప్పుడు గురుకులాలు ఉండేవి. కానీ అక్కడ ఇన్నేసి క్లాస్​ లు , టీచర్లు ఉండరు ఉండేది ఒకే గురువు. ఆయనే జీవితానికి కావల్సిన పాఠాలన్నీ నేర్పేవాడు. ఆ గురువులు డిజైన్ చేసిన కరిక్యులమ్ అప్పుడే కాదు ఇప్పటికీ ఎంతో ఆదర్శం.

గురువు అంటే...

ప్రతీ ఒక్కరూ జీవితంలో ఏదో ఒక స్టేజ్​ లో గురువు దగ్గర విద్యను నేర్చుకుంటారు. ఆ దశలో నేర్చుకున్న విషయాలే మొత్తం జీవితానికి అన్వయించుకుంటారు. జీవితానికి పరిపూర్ణత లభించేది గురువు దగ్గరే. సంపూర్ణ జ్ఞానం. పొందిన గురువే దాన్ని ఇవ్వగలుగుతారు. నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే మనిషికి కూడా భౌతిక, ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉంటాయి.

 నిద్ర లేచినప్పటి నుంచి చేసే రకరకాల పనులు, మానసిక ఒత్తిడులు, టెన్షన్లతో టైం వేగంగా వెళ్లిపోతూ ఉంటుంది. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు చేసే యాక్టివిటీస్ అన్నీ భౌతిక జీవితం కిందకు వస్తాయి.

 రెండవది ఆధ్యాత్మిక జీవితం.. అది మనలోనే దాగి ఉంది. మనల్ని సత్యం వైపునకు నడిపించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అది అంత సులభంగా దొరికి జ్ఞానం కాదు. దాన్ని గుర్తించడం చాలా కష్టం కానీ దాన్ని కనుక్కోలేక పోతే భౌతిక జీవితం ఎంత జీవించినా వృథానే. అయితే ఈ సృష్టిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థమయ్యే రీతిలో అందించే ఏకైక వ్యక్తి గురువు. ఆధ్యాత్మికంగా పరిపూర్ణ జీవితాన్ని ఎలా పొందాలో, భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో గురువు మాత్రమే బోధించగలడు.

ఆశ్రమమే ఒక పాఠం

గురుకులాల్లో ఉండే కరిక్యులమ్ ఒకటే. అదే  నిజమైన జ్ఞానం నిజమైన జ్ఞానం ఇంటే... సామాజిక విలువలు, నీతి శాస్త్రం, సంస్కృతీ సంప్రదాయాలు, బుద్ధి, క్రమశిక్షణ, పౌర. రాజకీయ ధర్మాలు, ఇతర శాస్త్రాలు, వీటితోపాటు ఆత్మ జ్ఞానం. అయితే వీటన్నింటినీ పుస్తకాలు, గ్రంధాల రూపంలో కాదు. ప్రాక్టికల్స్ గా నేర్పడమే. గురువు ప్రత్యేకత. దానికోసం అప్పట్లో ఆశ్రమ విధానం ఉండేది. ఊహ తెలిసిన వయసులో  ఆశ్రమానికి వచ్చి, పూర్తి, విద్యను నేర్చుకునే దాలా ఇక్కడే కొన్నేళ్ల పాటు ఉండాలి. ఈ ఆశ్రమాలకు నియమనిబంధనలతో కూడిన ఒక జీవన విధానం ఉంటుంది. అందుకే కేవలం ఇక్కడ నివసించడం వల్లనే వ్యక్తి జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్పుకోగలుగుతాడు.

కరిక్యులమ్ ఇదీ...

మనిషికి కావాల్సిన విషయాలన్నీ నేర్చుకునే విధంగా గురుకులంలో కరిక్యులమ్ డిజైన్ చేసేవాళ్లు.   సమాజంలో జరిగే వాటిని ఎలా విశ్లేషించాలి? వాటికి ఎలా స్పందించాలి? అనేవి గురువు నేర్పిస్తే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఎదుర్కోవడానికి ఏయే నైపుణ్యాలు అవసరం? అనేది ఆశ్రమంలో విద్యార్థులు సొంతంగా నేర్చుకుంటారు.   వినయంగా, భాధ్యతగా, ఎలా ఉండాలో శిష్యుడు ఆశ్రమంలో సొంతంగా అలవాటు చేసుకుంటాడు. ఆశ్రమంలోని జీవన విధానమే. శిష్యుడి ఓ పాఠం.

వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం గురువు ఆశ్రమంలో కొన్ని కృతిమ పరిస్థితులు సృష్టిస్తాడు. ఆత్మ స్థైర్యం, అవగాహన, విశ్లేషణ లాంటివి పాఠాల రూపంలో బోధిస్తే బోధపడవు అందుకే గురువు కొన్ని పరీక్షల ద్వారా వాటిని అలవరచుకునేలా చేస్తాడు. అలా గురువు పెట్టి పరీక్షల ద్వారా శిష్యుడు తనకు తాను మానసికంగా దృఢంగా తయారవుతాడు. బయట విషయాలతో పాటు కొన్ని నైపుణ్యాలు కూడా అలవరచుకుంటాడు.  అలాగే ఎకనమిక్, పాలిటాక్స్​ లాంటివి కూడా కేవలం పుస్తకాల్లో కాకుండా నిజ జీవితంలో అనుభవం ద్వారా ప్రాక్టికల్​గా నేర్చుకునే వీలుంటుంది . గురుకులాల్లో శిష్యుడి స్థాయిని బట్టి వాటిని ఎలా నేర్పాలో ప్రణాళిక వేసి నేర్పిస్తాడు గురువు చదువుతోనే ఆగకుండా ఆత్మ రక్షణకు అవసరమైన విద్యలు, యుద్ధ విద్యలు కూడా గురువే నేర్పుతాడు.

ఒకరికి ఒకరై..

గురుకులంలో ఒకే గురువు జీవితానికి సరిపడా విషయాలన్నీ నేర్పుతాడు. మనిషికి ...సమాజానికి కావాల్సిన పురుషార్థాలను అలవరుస్తాడు. ఇక్కడ గురుశిష్యులు ఇద్దరూ కలిసిమెలిసి జీవిస్తారు. నిత్యావసర వస్తువుల గురించి ఇద్దరికీ బెంగ ఉండదు. సంతృప్తిగా జీవించేవారు. క్రమశిక్షణ, మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు .  ఎంతో పెద్ద తప్పుచేస్తే తప్ప శిక్షలకు దండనలకు అవకాశం ఉండేది కాదు ఇలాంటి విధానాలపల్ల గురువుకి శిష్యుడికి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. అలాగే శిష్యుడికి గురువుమీద అమితమైన ప్రేమ, గౌరవం బలపడుతాయి.

గురువు ఒక అదృష్టం

మొత్తానికి విద్యావిధానాల్లో ఎన్నిమార్పులొచ్సినా గురువు ఎప్పటికీ గురువే... గురువు.. ఎలాంటి కరిక్యులమ్ డిజైన్ చేసినా అది అప్పటి పరిస్థితులకి సొల్యూషన్ చెప్పేదిలా ఉంటుంది. శిష్యుడికి ఏది అవసరమో తెలిసి, వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించి, నిజమైన జ్ఞానాన్ని అందించగలవాడే గురువు.   గురువు మనతో  సహజీవనం చేస్తూ మన లాగే తప్పొప్పులు చేస్తూ ఉన్నట్లు కనబడుతూ మనల్ని చెయ్యి పట్టి సడిపిస్తూ ఉంటాడు. అలాంటి గురువు దొరకడం శిష్యుడి అదృష్టం. గురువుకి శిష్యుడిపై ప్రేము విశ్వాసం ఎప్పటికీ తగ్గవు, గురువు ఎప్పుడూ శిష్యుడి క్షేమంతో పాటు లోకక్షేమం. దేశ క్షేమం గురించి కూడా ఆలోచిస్తుంటాడు.


విద్యావిధానంలో మరో ముఖ్యమైన అంశం బ్రహ్మ చర్యం ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు శిష్యులు. కఠోర బ్రహ్మ చర్య దీక్ష పాటించాలి బ్రహ్మచర్యంలో కఠినమైన నియమాలుంటాయి. విద్యార్థి దశలో ఎన్నో ఆలోచనలు పక్కదోవ పట్టిస్తుంటాయి. వాటిని అదుపులో పెట్టేందుకే బ్రహ్మచర్య దశలో కొన్ని పరిచమైన నియమాలకు గురువు నిర్దేశిస్తారు. పన్నెండేళ్ల పాటు బ్రహ్మచర్య దీక్ష పాటించిన శిష్యుడు  బలమైన వ్యక్తిత్వంతో బయటకు వస్తాడు. బ్రహ్మచర్యం లో పాటించిన నియమాలు ఇండివిడ్యువాలిటీని పెంపొందిస్తాయి ఆశ్రమం నుండి బయటకు వచ్చాక మీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలకు బ్రహ్మచర్యం పరిష్కారం చూపుతుంది.