విధుల్లో నిర్లక్ష్యం వహించిన టీచర్లపై వేటు

  • సర్వీస్​ నుంచి 16 మంది  రిమూవల్​

యాదాద్రి, వెలుగు : ఏండ్లుగా డ్యూటీలకు డుమ్మా కొడుతున్న టీచర్లపై విద్యాశాఖ  కొరడా ఝళిపించింది. 16 మందిని జాబ్ నుంచి తొలగిస్తూ (రిమూవ్​ ఫ్రం సర్వీస్​) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి జిల్లాలో 18 మంది టీచర్లు విధులకు హాజరుకావడం లేదు. 2005 నుంచి ఇప్పటివరకు డుమ్మా కొడుతున్న వారుండగా..  గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఇటీవల ఇద్దరు డ్యూటీలో చేరారు. మిగిలిన 16 మంది రెస్పాండ్ కాలేదు. గత మేలో గెజిట్ నోటీసు కూడా జారీ చేశారు. అయినా టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో వారందరికీ సర్వీస్​ నుంచి రిమూవ్​చేస్తూ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​ఆదేశాలు జారీ చేసింది.