వేములవాడ, వెలుగు : ఉపాద్యాయ పదోన్నతుల్లో ఎస్జీటీలకు అన్యాయం జరిగిందని వేములవాడ ఎంఈవో బన్నాజీకి ఉపాధ్యాయులు బుధవారం వినతి పత్రం అందజేశారు. బీఈడీ టీచర్లు దాదాపు 20- సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం వల్ల సీనియర్ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.
12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్జీటీలను ఎస్ఏ లుగా ప్రమోట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, చక్రపాణి, కృష్ణహరి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, రాంగోపాల్, నరేష్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.