బడుల్లో పారిశుధ్య కార్మికుల కోసం నిధులు రిలీజ్ చేయాలి

బడుల్లో పారిశుధ్య కార్మికుల కోసం నిధులు రిలీజ్ చేయాలి


 స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​కు  టీచర్ల జేఏసీ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని సర్కారు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా, తగిన నిధులు రిలీజ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ(జాక్టో) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం ఎస్​టీయూ భవన్​లో జాక్టో సమావేశం జరిగింది. అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని జాక్టో నేతలు సదానందంగౌడ్, పర్వత్ రెడ్డి (ఎస్​టీయూ), కె.కృష్ణుడు(బీసీటీఏ), చెన్నయ్య(టీపీఆర్టీయూ), చైతన్య (బీటీఏ), హేమచంద్రుడు(హెచ్​ఎంఏ) తదితరులు కలిసి వినతిపత్రం అందించారు. ప్రైమరీ స్కూళ్లలో ఒక పీరియడ్ తగ్గించి మధ్యాహ్నం 3:30 గంటలకే క్లోజింగ్ టైమ్ మార్చాలని కోరారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లలో జరిగిన తప్పిదాలపై వచ్చిన అప్పీళ్లన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. బదిలీ అయిన టీచర్లందరినీ రిలీవ్ చేయాలని, ప్రైమరీ స్కూళ్లలో క్లాసురూమ్ కు ఒక టీచర్ ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.