
డీఈవోల మీటింగులో విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా
హైదరాబాద్, వెలుగు: పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు డీఈవోలు కృషి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. స్టూడెంట్లను టీచర్లు దత్తత తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో డీఈవోలు, ఆర్జేడీలు, అడిషనల్ డైరెక్టర్లతో ఆమె సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ... విద్యా ప్రమాణాలను పెంచడం, విద్యావిధానాలను పటిష్టంగా అమలు పరచడం ద్వారా విద్యలో ప్రగతి సాధ్యమవుతుందన్నారు. పెర్ఫామెన్స్ గ్రేడ్ ఇండికేటర్స్ –పీజీఏలో తెలంగాణ ముందుండాలన్నారు. రెండేండ్ల నుంచి విద్యార్థుల నమోదు తగ్గుతుందని, ప్రతి స్టూడెంట్ ను ట్రాక్ చేసి స్కూల్లో చేర్పించాలని చెప్పారు. స్కూళ్లకు రిలీజ్ చేసిన బడ్జెట్ను మొత్తం ఖర్చు చేయాలని ఆదేశించారు. టెన్త్ లో సంస్కరణలు తీసుకొచ్చినందుకుగానూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈఎల్ నర్సింహారెడ్డి, ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావును ఆమె సన్మానించారు.