టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

హైదరాబాద్, వెలుగు: సర్వీస్​ టీచర్లకు ప్రమోషన్ కోసం టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్​రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి కేంద్రాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో ఎన్​సీటీఈ మెంబర్ సెక్రటరీ కేసంగ్ వై షెర్పాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎస్​జీటీ నుంచి పీఎస్ హెచ్​ఎం, స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్​ఎంగా ప్రమోషన్ పొందేందుకు టెట్ ఉత్తీర్ణత అవసరం లేదని ఆమె చెప్పినట్టు పేర్కొన్నారు. ఎస్​జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అని వివరించారు. తెలంగాణ సర్కారు టెట్ నిర్వహించకపోవడంతో టీచర్లకు ప్రమోషన్లు కల్పించేందుకు గాను టెట్ అర్హత పొందేందుకు ఐదేండ్ల కాలపరిమితిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు జారీచేస్తామని హామీ ఇచ్చినట్టు పీఆర్టీయూ నేతలు తెలిపారు.