కరీంనగర్ సిటీ, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీపీయూఎస్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్కలెక్టరేట్ ఎదుట టీచర్లు ధర్నా చేశారు. ఈసందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్‌వేసి తక్షణమే ఐఆర్ప్రకటించాలని డిమాండ్‌చేశారు.
ఎనిమిదేండ్లుగా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో లీడర్లు కృష్ణారెడ్డి, వెంకటరమణారావు, వేణు కుమార్, తిరుపతిరావు, రాజేశ్వర్, రంగారావు, రామచంద్రరావు, మురళీధర్ రావు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.