
మెదక్ టౌన్, వెలుగు : తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఉద్యోగ, ఉపాధ్యాయులను అవమానించే విధంగా మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మెదక్ జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) అధ్యక్ష, కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మెదక్‌పట్టణంలోని తపస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధు ఆపి ఉద్యోగులకు జీతాలు ఇస్తారా అనడం సరైంది కాదన్నారు.
రైతులను ఉద్యోగులపైకి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫస్ట్తారీకు జీతాలు ఇస్తే హరీశ్‌రావుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో తపస్ నాయకులు మాధవరెడ్డి, నర్సింలు, రాజు, శ్రీకాంత్ రెడ్డి, సిద్దు, నరేందర్, మధు మోహన్ పాల్గొన్నారు.