కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలో సర్కారు బడుల్లో విధులు నిర్వర్తిస్తున్న టీచర్లపై దాడులను అరికట్టాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జడ్పీ స్కూల్ హెచ్ఎం రాములుపై దాడి చేసినవారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు కాగజ్ నగర్ డివిజన్లో టీచర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.
సిర్పూర్ టీ మండలం వేంపల్లి జడ్పీ స్కూల్లో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హనుమయ్య, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, సోయం ఇందురావుతో పాటు వివిధ సంఘాల నాయకులు ప్రకాశ్, శ్యాంసుందర్ పాల్గొన్నారు.