- ప్రభుత్వానికి జాక్టో వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినేట్ జీవో 317పై తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని టీచర్ల సంఘాల జేఏసీ (జాక్టో) చైర్మన్ సదానందం గౌడ్, సెక్రెటరీ జనరల్ కె. కృష్ణుడు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఎస్టీయూ భవన్లో జాక్టో సమావేశం జరిగింది. ఈసందర్బంగా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని, ఉద్యోగ సంఘాలతో చర్చించి ఫిట్ మెంట్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
నెలల తరబడి పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, వారికి ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని మేనేజ్ మెంట్లలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పింఛన్లకు ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలన్నారు.