సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు

కరీంనగర్, వెలుగు: సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్టీ యూటీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రవి, ఎస్సీ, ఎస్టీ టీచర్ యూనియన్ నేత మీసాల మల్లిక్, ఎస్టీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పీఆర్. శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ జి. శ్రీనివాస్, కే.లక్ష్మణరావు, వెంకటస్వామి, తెలంగాణ బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గతేడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుడి  హోదాలో ప్రస్తుత సీఎం హనుమకొండలో ఏకశిల పార్క్ వద్ద చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వందరోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో తమ ఎమ్మెల్యేల ద్వారా లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాప్రధాన కార్యదర్శి మహేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్, రవిచంద్ర, బి. శ్రీకాంత్, కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఎం. అజిత,బి రమాదేవి,ఎన్ పూర్ణిమ గౌతమి,పి.మాధవి,పి కిరణ్ జ్యోతి,ఎం స్వప్న పాల్గొన్నారు. .