రేపటి నుంచి బడులకు టీచర్లు

రేపటి నుంచి బడులకు టీచర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా అన్​లాక్ –4  గైడ్​లైన్స్​కు అనుగుణంగా ఈ నెల 21 నుంచి టీచర్లు మళ్లీ బడిబాట పట్టనున్నారు. రోజూ స్కూల్ లోని సిబ్బందిలో 50 శాతం మందే హాజరు కానున్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో ఒక టీమ్.. మంగళ, గురు, శనివారాల్లో మరో టీమ్ ​స్కూల్​కు వచ్చేలా టైమ్ టేబుల్ రూపొందించనున్నారు. స్కూల్​లో ఒకే సబ్జెక్టు టీచర్లు ఇద్దరుంటే.. వారిద్దరు వేర్వేరు రోజుల్లో వచ్చేలా ప్లాన్ చేశారు. సింగిల్ టీచర్ ఉన్న బడుల్లోనూ డే బై డేనే రావాలని, టీచర్లు బడికి రాని రోజు ఇంటి నుంచే డిజిటల్ క్లాసులను మానిటరింగ్ చేయాలని అధికారులు ఆదేశించారు. డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు బడులకు వచ్చే 9, 10వ తరగతి స్టూడెంట్లు తమ పేరెంట్స్ నుంచి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొని రావాలన్నారు.

For More News..

ఇప్పటికే 45 శాతం ఎక్కువ కురిసిన వానలు

నాలుగైదు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బంద్.. పేషెంట్లను చేర్చుకోని హాస్పిటళ్లు