నవోదయలో ఆరోతరగతి ఎంట్రెన్స్.. అప్లయ్ లాస్ట్ డేట్ అక్టోబర్ 7​

నవోదయలో ఆరోతరగతి ఎంట్రెన్స్.. అప్లయ్ లాస్ట్ డేట్ అక్టోబర్ 7​

విద్యార్థులకు సృజనాత్మక పద్ధతుల్లో బోధన.. ఆహ్లాదకర వాతావరణంలో అభ్యసనం..లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బై డూయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో స్కిల్స్​ పెంచే నవోదయ విద్యాలయాల్లో ఆరోతరగతిలో ఎంట్రెన్స్​కు కేంద్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. 

పాఠశాల స్థాయి నుంచే ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైపుణ్యాలు కోరుకునే వారికి సరైన విద్యాసంస్థలు జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీలు. ఈ నేపథ్యంలో జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ (జవహర్​ నవోదయ విద్యాలయ)ల అడ్మిషన్ ప్రాసెస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​, ఎంట్రెన్స్​ వివరాలు తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా 653 జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌‌వీ)లో ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రెన్స్​ పరీక్ష-2025 దరఖాస్తుకు అక్టోబరు 7 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అంది స్తారు. బాలబాలికలకు వేర్వేరు హాస్టల్​, వసతి సౌకర్యాలు కల్పించారు.

లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బై డూయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతి: జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయాల్లో ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇస్తారు. ‘లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బై డూయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ విద్యా విధానాన్ని అనుసరిస్తారు. ఏదైనా ఒక అంశాన్ని బోధించినప్పుడు దానికి సంబంధించి ప్రాక్టికల్స్, పజిల్స్, క్విజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వంటివి నిర్వహించి..సదరు అంశంపై విద్యార్థులకు ఆసక్తి కలిగేలా, అవగాహన పెరిగేలా చేస్తారు. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి విద్యార్థులకు వాస్తవ దృక్పథం పెరిగే విధంగా యాక్టివిటీ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్, స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలో ఎగ్జిబిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తూ.. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలకు వాస్తవ రూపం ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. 

రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం:  జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయాల మరో ప్రత్యేకత.. పూర్తిగా రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానాన్ని అమలు చేయడం. వీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులు సదరు పాఠశాలల వసతి గృహాల్లోనే ఉండి చదువు కోవాల్సి ఉంటుంది. క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోధనతోపాటు హాస్టల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెంటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి నిత్యం ఉపాధ్యాయుల సహకారం ఉండేలా చూస్తున్నారు. 

ఆరో తరగతిలో ప్రవేశానికి జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ) పేరుతో ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి కూడా పరీక్ష ఉంటుంది. కాని తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను మాత్రమే భర్తీ చేస్తారు.

విద్యార్థులకు కేటాయించే సీట్లు: ప్రతి నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో గరిష్టంగా 80 సీట్లు అందుబాటులో ఉంటాయి. కనిష్టంగా 40 సీట్లు ఉంటాయి. 2022 వరకు గరిష్ట సీట్ల సంఖ్య ప్రతి పాఠశాలలో 60గా ఉండేది. 2023 నుంచి 80కి పెరగడంతో మరింతమంది విద్యార్థులకు నవోదయ విద్య అందుకునే అవకాశం లభించనుంది. 

జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో దేశ వ్యాప్తంగా మొత్తం 653 నవోదయ పాఠశాలలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీలు ఏర్పాటయ్యాయి.

ఫ్రీ ఎడ్యుకేషన్:  జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీలో ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అన్నింటినీ ఉచితంగా అందిస్తారు. విద్యా వికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గాల(దారిద్య్ర రేఖ దిగువ ఉన్న) పిల్లలకు మినహాయింపునిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎగ్జామ్​ ప్యాటర్న్​:  ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ) మొత్తం 80 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ఇందులో మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎబిలిటీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, అర్థమెటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 ప్రశ్నలు–25 మార్కులు, లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోనే ఉంటుంది. 

ఆయా రాష్ట్రాల మాతృభాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠి, ఉర్దూ, కన్నడ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంది. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా మాధ్యమంలోనూ పరీక్షకు హాజరయ్యే వీలుంది.

గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యం: పాఠశాల విద్యలో వినూత్న విధానాన్ని అమలు చేయాలని, అందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటైనవే జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయాలు. ఇందుకోసం కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయ సమితి పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీల ప్రధాన లక్ష్యంగా ఉంది. 

జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీలలోని సీట్లలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. మొత్తం సీట్లలో 75 శాతం సీట్లను పల్లెప్రాంత విద్యార్థులకు కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అదే విధంగా మహిళా విద్యార్థులను సైతం ప్రోత్సహించే విధంగా.. మొత్తం సీట్లలో మహిళా విద్యార్థులకు 33 శాతం (1/3 వంతు) సీట్లను కల్పిస్తున్నారు.

సెలెక్షన్​: ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో ఏర్పాటైన జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీల్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు సదరు జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ నెలకొన్న జిల్లాకు చెందిన వారై ఉండాలి. జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ పరీక్షలో సాధించిన మార్కులు,దరఖాస్తు చేసుకున్న జిల్లా, సదరు జిల్లాలో ఉన్న జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీలో సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని..రిజర్వేష­న్లు తదితర అంశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి­లో తుది మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబితాను విడుదల చేస్తారు. 

ఈ జాబితాలో నిలిచిన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ పరీక్షలో మంచి మార్కులు పొందేందుకు విద్యార్థులు.. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ పుస్తకాలను అభ్యసించడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రధానంగా నాలుగు, అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు చదవాలి.

నోటిఫికేషన్​ 

అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-–25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. 

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.navodaya.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపీని అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం తప్పనిసరి. 

దీంతోపాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది. పరీక్ష జనవరి 18న ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు సంబంధిత జిల్లాలో ఎంపిక చేసిన అన్ని కేంద్రాల్లో నిర్వహిస్తారు.