- 130 టేకు చెట్ల నరికివేత
- సోషల్ మీడియాలో వైరల్
- స్పందించని అటవీ సిబ్బంది
ములుగు, వెలుగు : ములుగు మండలం బరిగలపల్లి శివారు వరాలగుట్ట అడవిలో టేకు దొంగలు పడ్డారు. 130 టేకు చెట్లను నరికివేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతకాలంగా వరాల గుట్టపైకి బాట చేసిన కొందరు అక్రమార్కులు చెట్లను నరికి మొద్దులను తరలించారు. అటవీ అధికారులకు తెలిసిన రెస్పాన్స్ లేదు. రామప్ప సరస్సును ఆనుకొని వరాల గుట్టపైకి ఎవరూ వెళ్లేందుకు సాహసం చేయరు. ఇటీవలి గుట్టపైకి బాటను చేసి చెట్లను నరికి మొద్దులు తరలిస్తున్నారని, ఇందుకు స్థానిక అటవీ అధికారులు, సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. దీనిపై అటవీ శాఖ రేంజ్అధికారిని వివరణ కోరేందుకు ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలోని వరాల గుట్టపై నుంచే టేకు కర్ర అక్రమ రవాణా జరగడంపై పర్యావరణ సంరక్షకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.