ODI World Cup 2023: చేతికి నల్ల రిబ్బన్ కట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. కారణమిదే

ODI World Cup 2023: చేతికి నల్ల రిబ్బన్ కట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. కారణమిదే

వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ తో తలపడుతుంది.  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసిట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉండగా టాస్ తర్వాత జాతీయ గీతం ఆలపించేటప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ మోచేతికి నల్ల రిబ్బన్ ధరించారు. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫవాద్ అహ్మద్ కొడుకు ప్రాణాలతో పోరాడి చనిపోవడమే దీనికి కారణం. 

 అతని నాలుగు నెలల పాప అస్వస్థత కారణంగా ప్రాణాలతో పోరాడి ఆస్పత్రిలో చనిపోయింది. ఈ విషాద వార్తను విన్న క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. "ఫవాద్ కుమారుడు మరణించాడనే వార్త చాలా విచారానికి గురి చేసింది. అతని కుటుంబంపై మా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది". అని ట్వీట్ చేసింది. కాగా.. 2013 లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన ఫవాద్.. 3 వన్డేలు, 2 టీ 20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో3, టీ 20 ల్లో 3 వికెట్లు తీసుకున్నాడు. 

ఇక వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వరుసగా మూడో విజయం పై కన్నేసింది. భారత్, దక్షిణాఫ్రికా మీద మొదటి రెండు వన్డేలు ఆడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్ పై వరుస విజయాలు సాధించి గాడిల్ పడింది. ప్రస్తుతం నెదర్లాండ్స్ మీద మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా 19 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. వార్నర్ (60) స్మిత్ (50) క్రీజ్ లో ఉన్నారు.