విశాఖపట్నంలో క్రికెట్ సందడి నెలకొంది. వైజాగ్ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ క్రమంలో స్టేడియానికి వెళ్లేందుకు APSRTC బస్సుల్లో ప్రయాణించారు. రెండు జట్లకు రెండు బస్సులను ఏర్పాటు చేశారు. హోటల్ నుంచి స్టేడియానికి టీమిండియా, ఇంగ్లండ్ క్రికెటర్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని APSRTC అధికారులు ట్వీట్ చేశారు. బీసీసీఐకి , ఇంగ్లండ్ బోర్డు కు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
APSRTC Buses being used by Team India and Team England cricket teams for the second test at Visakhapatnam
— APSRTC (@apsrtc) February 2, 2024
Thank you for patronising us @bcci @englandcricket#INDvsENGTest pic.twitter.com/AOPUvNtQ0v
విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(179 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. రోహిత్, గిల్, అయ్యర్ వంటి సీనియర్లు విఫలమైన చోట ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ భారీ స్కోరుకు పునాదులు వేశాడు. రోహిత్ శర్మ(14), గిల్ (34), శ్రేయాస్ అయ్యర్(27), పటీదార్(32), అక్సర్ పటేల్(27) పరుగులు చేశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 93 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 336 పరుగులు చేసింది.