వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరం కోసం భారత క్రికెట్ జట్టు సోమవారం( నవంబర్ 13) ముంబై చేరుకుంది. న్యూజిలాండ్ తో జరగనున్న ఈ మ్యాచ్ కోసం సోమవారం ఉదయం ముంబైకు బయలుదేరిన మన క్రికెటర్లు తాజాగా ముంబై చేరుకున్నారు. నిన్న (నవంబర్12) నెదర్లాండ్స్ పై జరిగిన చివరి మ్యాచ్ లో 160 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈ వరల్డ్ కప్ లో తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వరుసగా 9 వ విజయాన్ని నమోదు చేసింది.
నవంబర్ 15 (బుధవారం) న ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు ముంబై చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించేసారు. ఈ వరల్డ్ కప్ లో ఆడిన 9 మ్యాచ్ ల్లో విజయం సాధించిన భారత జట్టు అగ్ర స్థానంలో ఉంటే.. ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ రెండు జట్ల మధ్య 2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో కివీస్ 18 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అప్పుడు కూడా టీమిండియా టేబుల్ టాపర్ గా ఉంటే న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలిచింది. మరోసారి అదే సీన్ రిపీట్ కావడంతో ఈ మ్యాచ్ భారత్ గెలుస్తుందా లేదా అని అభిమానులకు టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం భారత జట్టు ఉన్న ఫామ్ చూస్తుంటే ఓడిపోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడం మన జట్టుకు కలిసి రానుంది.
#WATCH | Team India arrives at Mumbai airport ahead of ICC World Cup Semi-Final match against New Zealand at Wankhede Stadium on Wednesday, November 15. pic.twitter.com/OCPmEtKh4v
— ANI (@ANI) November 13, 2023