IND vs SL 2024: శ్రీలంకకు చేరుకున్న భారత క్రికెట్ జట్టు

IND vs SL 2024: శ్రీలంకకు చేరుకున్న భారత క్రికెట్ జట్టు

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ తొలిసారిగా విలేకరుల సమావేశాన్ని ముగించుకొని భారత జట్టుతో శ్రీలంక బయలుదేరారు. సోమవారం (జూలై 22) భారత జట్టు ముంబై నుంచి శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. తాజాగా టీమిండియా ఆటగాళ్లు శ్రీలంక చేరుకున్నారు.  ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ లంక గడ్డపై అడుగుపెట్టిన ఫోటోలు వైరల్ గా మారాయి.

భారత టీ20 జట్టు మాత్రమే శ్రీలంకకు బయలుదేరినట్టు కనిపిస్తుంది. జూలై 27 నుంచి టీ 20 సిరీస్ ప్రారంభమవుతుంది. వన్డే జట్టు త్వరలో లంకకు బయలుదేరుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్‌, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.  

Also Read:-తొలి మ్యాచ్‌లోనే పసికూన బౌలర్ ప్రపంచ రికార్డ్

ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కేవలం రెండు స్టేడియాలకే పరిమితం చేశారు. టీ20 మ్యాచ్‌లన్నీ పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(పల్లెకెలె) వేదికగా జరగనుండగా.. వన్డే సిరీస్ కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియానికి పరిమితమైంది. భారత కాలమానం ప్రకారం, టీ20లు రాత్రి 7:30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.