క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేదార్ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేదార్ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

పుణె : టీమిండియా బ్యాటర్ కేదార్ జాదవ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేండ్లుగా నేషనల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న 39 ఏండ్ల కేదార్ 2014లో శ్రీలంకపై వన్డే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 73 వన్డేల్లో 1389 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడు.  

9 టీ20ల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. మాజీ కెప్టెన్ ధోనీకి సన్నిహితుడిగా పేరొందిన కేదార్ మహీ స్టయిల్లోనే కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికాడు. ‘నా కెరీర్ మొత్తంలో మీరు అందించిన ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు. ఈ మధ్యాహ్నం మూడు గంటల నుంచి నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్టు పరిగణించండి’ అని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్వీట్ చేశాడు.