Ranji Trophy: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్.. ఘోరంగా విఫలమైన టీమిండియా క్రికెటర్లు

Ranji Trophy: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్.. ఘోరంగా విఫలమైన టీమిండియా క్రికెటర్లు

ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న భారత క్రికెటర్లు రంజీ ట్రోఫీ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఖాళీ దొరికితే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇటీవలే బీసీసీఐ తప్పనిసరి చేసింది. దీంతో స్టార్ క్రికెటర్ల రాకతో ఈసారి కళకళలాడుతుంది అని భావించారు. బుధవారం (ఫిబ్రవరి 23) రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభమైంది. అయితే టీమిండియా స్టార్ క్రికెటర్లు మాత్రం తొలి రోజు దారుణంగా విఫలమయ్యారు. అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమవ్వడం షాకింగ్ కు గురి చేస్తుంది. 

జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో మహారాష్ట్ర తరపున రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు చేసి ఔట్ కాగా.. జైశ్వాల్ 5 పరుగులకే పరిమితమయ్యాడు. పంజాబ్ తరపున ఆడుతున్న గిల్.. కర్ణాటకపై కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్ కు చేరాడు. రిషబ్ పంత్ ఒక పరుగుకే ఔటై తీవ్రంగా నిరాశ పరిచాడు. రంజీ ట్రోఫీ ఆడి బౌన్స్ బ్యాక్ అవుదామనుకుంటే మన క్రికెటర్లు ఒకరు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. గతంలో టెస్ట్ జట్టులో ఉన్న శ్రేయాస్ అయ్యర్ 11 పరుగులు చేస్తే రహానే 12 పరుగులతో సరిపెట్టుకున్నాడు. 

ALSO READ | Ranji Trophy: ఔటైనా గ్రౌండ్‌లోనే ఉన్నాడు.. మహారాష్ట్ర సీనియర్ క్రికెటర్‌పై మ్యాచ్ నిషేధం

గైక్వాడ్ 10 పరుగులు మాత్రమే చేస్తే.. రజత్ పటిదార్ డకౌటయ్యాడు. అసలే టీమిండియాలో చెత్త ఫామ్ తో ఇబ్బందిపడుతున్న వీరు రంజీ ట్రోఫీలోనూ విఫలం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాహుల్, కోహ్లీ గాయాల కారణంగా రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ లో ఆడలేదు. వీరు రెండో మ్యాచ్ కు అందుబాటులో ఉండడనున్నారు. తొలి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మినహాయిస్తే మిగిలినవారందరూ విఫలమయ్యారు. జూన్ లో జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ కి ఎంపిక కావాలంటే రంజీ ట్రోఫీలో రాణించడం కీలకంగా మారింది.