పది వికెట్లతో.. నేపాల్‌‌పై ఇండియా గ్రాండ్‌‌ విక్టరీ

పది వికెట్లతో.. నేపాల్‌‌పై ఇండియా గ్రాండ్‌‌ విక్టరీ
  • ఫిఫ్టీలతో మెరిసిన రోహిత్‌‌, గిల్‌‌
  • సూపర్‌‌4 రౌండ్‌‌కు రోహిత్‌‌సేన
  • నేడు అఫ్గానిస్తాన్​​తో శ్రీలంక మ్యాచ్​
  • మ. 3 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో

పల్లెకెలె: ఆసియా కప్‌‌లో ఇండియా సూపర్‌‌4 రౌండ్‌‌కు చేరుకుంది. వాన మరోసారి విసిగించినా.. ఫీల్డర్లు నిరాశ పరిచినా.. ఓపెనర్లు రోహిత్‌‌ శర్మ (59 బాల్స్​లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 నాటౌట్​), శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (62 బాల్స్​లో 8 ఫోర్లు, 1 సిక్స్​తో 67 నాటౌట్​) మెరుపులతో టోర్నీలో తొలి విజయం సాధించింది. సోమవారం వాన పలుమార్లు అంతరాయం కలిగించిన గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో రోహిత్‌‌సేన 10 వికెట్ల తేడాతో (డక్​వర్త్​)  నేపాల్‌‌ను చిత్తు చేసింది. తొలుత టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన నేపాల్‌‌ 48.2 ఓవర్లలో 230 రన్స్‌‌కు ఆలౌటైంది. ఓపెనర్‌‌ ఆసిఫ్‌‌ షేక్‌‌ (58), సోంపాల్‌‌ (48) రాణించారు. జడేజా, సిరాజ్‌‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం వాన వల్ల టార్గెట్​ ను 23 ఓవర్లలో 145 రన్స్‌‌గా లెక్కగట్టగా.. ఇండియా 20.1 ఓవర్లలోనే 147/0 చేసి గెలిచింది.  రోహిత్​కు  ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది. గ్రూప్‌‌–బి నుంచి పాక్‌‌, ఇండియా సూపర్‌‌4 చేరాయి. 

49 ఓవర్ల బ్యాటింగ్‌‌

టాస్ నెగ్గిన ఇండియా బౌలింగ్‌‌ ఎంచుకోగా  నేపాల్‌‌ వంద రన్స్‌‌ చేస్తే గొప్ప అనిపించింది కానీ, నేపాల్‌‌ బ్యాటర్లు 49 ఓవర్ల పాటు అద్భుతంగా పోరాడారు. పేలవ ఫీల్డింగ్​తో తొలి ఐదు ఓవర్లలోనే మూడు క్యాచ్‌‌లు డ్రాప్‌‌ చేసిన ఇండియా ఇచ్చిన చాన్స్​లను సద్వినియోగం చేసుకున్న నేపాల్‌‌ ఓపెనర్లు భుర్తెల్‌‌ (38), ఆసిఫ్‌‌ తొలి పది ఓవర్లోనే 65 రన్స్‌‌ రాబట్టారు. 1,7 రన్స్‌‌ వద్ద క్యాచ్‌‌లు డ్రాప్‌‌ అయిన కుశాల్‌‌ను చివరకు పదో ఓవర్లో ఔట్‌‌ చేసిన శార్దూల్‌‌ ఇండియాకు ఫస్ట్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు. ఈ టైమ్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన స్పిన్నర్‌‌  జడేజా 16–21 ఓవర్ల మధ్యలో కెప్టెన్‌‌ పాడెల్‌‌ (5), కుశాల్‌‌ (2 ), శార్కి (7)ని పెవిలియన్‌‌ చేర్చి నేపాల్‌‌ను 101/4తో నిలిపాడు. జోరు కొనసాగించి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఆసిఫ్‌‌ను కోహ్లీ క్యాచ్‌‌తో సిరాజ్‌‌ ఔట్​ చేశాడు. తన తర్వాతి ఓవర్లోనే గుల్షన్‌‌ (23)ను కూడా వెనక్కుపంపాడు. దాంతో, 144 రన్స్‌‌కే ఆరు వికెట్లు కోల్పోయిన ప్రత్యర్థి ఎంతోసేపు నిలవదనిపించింది. కానీ, లోయర్‌‌ ఆర్డర్‌‌లో దీపేంద్ర సింగ్‌‌ (29)తో కలిసి సోంపాల్‌‌ కామి ఇండియా బౌలర్లకు ఎదురు నిలిచాడు. మధ్యలో రెండుసార్లు వర్షం వల్ల గంట సమయం వృథా అవగా తిరిగి ఆట మొదలైన తర్వాత కూడా  మెప్పించి ఈఇద్దరూ ఏడో వికెట్‌‌కు 56 రన్స్‌‌ జోడించారు. పాండ్యా బౌలింగ్‌‌లో దీపేంద్ర ఔటైనా.. ఎనిమిదో వికెట్‌‌కు సందీప్‌‌ లమిచానె (9)తో కామి 34 రన్స్‌‌ జోడించడంతో నేపాల్​ స్కోరు 200 దాటింది. 

 ఓపెనర్లే దంచేశారు

ఛేజింగ్‌‌లో ఇండియా 2.1 ఓవర్లలో 17/0తో ఉన్న టైమ్‌‌లో వాన మళ్లీ మొదలవడంతో దాదాపు రెండు గంటలు అంతరాయం కలిగింది. దాంతో అంపైర్లు ఇన్నింగ్స్‌‌ను 23 ఓవర్లకు కుదించి టార్గెట్‌‌ను సవరించారు. అప్పటికి 20.5 ఓవర్లలో ఇండియాకు 128 రన్స్‌‌ అవసరం అవగా ఓపెనర్లే కొట్టేశారు.  హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ తన ట్రేడ్‌‌మార్క్‌‌  షాట్లతో సిక్సర్లు కొడుతూ ఫ్యాన్స్‌‌ను అలరించాడు. స్టార్టింగ్‌‌లో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్‌‌, గిల్‌‌ తర్వాత స్పీడు పెంచారు. లమిచానెను టార్గెట్‌‌ చేసి భారీ షాట్లు బాదారు. ఏడో ఓవర్లో  రోహిత్‌‌ స్వీప్‌‌ షాట్లతో 4,6తో జోరందుకున్నాడు. అతని బౌలింగ్‌‌లోనే గిల్‌‌ స్ట్రెయిట్‌‌ సిక్స్‌‌తో ఆకట్టుకున్నాడు. 11వ ఓవర్లో రోహిత్‌‌ మరో 4,6 బాదాడు. దీపేంద్ర ఓవర్లో స్లాగ్‌‌ స్వీప్‌‌ షాట్‌‌తో సిక్స్‌‌ కొట్టిన అతను సోంపాల్‌‌ బౌలింగ్‌‌లో ఫోర్‌‌తో 39 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్‌‌ కూడా 47 బాల్స్‌‌లో ఫిఫ్టీ దాటాడు.  ఈ ఇద్దరి జోరుతో టార్గెట్​ఈజీగా 
కరిగిపోయింది. 

ఇట్ల విడిస్తె ఎట్ల..

ఈ మ్యాచ్‌‌లో ఇండియా ఫీల్డింగ్‌‌ సాధారణ జట్టును తలపించింది. ఏకంగా నాలుగు క్యాచ్‌‌లు డ్రాప్‌‌ చేసింది. షమీ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్‌‌ భుర్తెల్‌‌ బ్యాట్‌‌కుఎడ్జ్‌‌ అయిన బాల్‌‌ను ఫస్ట్‌‌ స్లిప్‌‌లో అయ్యర్‌‌ అందుకోలేకపోయాడు. షమీ బౌలింగ్‌‌లోనే  ఐదో ఓవర్లో అతనిచ్చిన ఇంకో క్యాచ్‌‌ను కీపర్‌‌ ఇషాన్‌‌ వదిలేయగా అది బౌండ్రీకి వెళ్లింది. అంతకుముందు సిరాజ్‌‌ వేసిన రెండో ఓవర్‌‌ తొలి బాల్‌‌కు ఆసిఫ్‌‌ షేక్‌‌  ఇచ్చిన సింపుల్​ క్యాచ్‌‌ను కోహ్లీ డ్రాప్​ చేశాడు. ఇక కుల్దీప్‌‌ వేసిన 41వ ఓవర్లో సోంపాల్‌‌ ఇచ్చిన టఫ్‌‌ క్యాచ్‌‌ను కీపర్‌‌ ఇషాన్‌‌ పట్టుకోలేకపోయాడు. వీటికి తోడు మిస్​ ఫీల్డింగ్​, సరైన త్రోలు చేయలేక ఫీల్డర్లు నిరాశ పరిచారు.