ఆసీస్‌‌‌‌‌‌‌‌తోనే ఆరంభం..కొత్త ఏడాదిలోనూ టీమిండియాకు బిజీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌

ఆసీస్‌‌‌‌‌‌‌‌తోనే ఆరంభం..కొత్త ఏడాదిలోనూ టీమిండియాకు బిజీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌
  •     చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ, ఆసియా కప్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌లు
  •     విమెన్స్‌‌‌‌‌‌‌‌లో రెండు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌ 
  •     టెన్నిస్‌‌‌‌‌‌‌‌, షూటింగ్‌‌‌‌‌‌‌‌, అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లోనూ మెగా టోర్నీలు

గతేడాది విశ్వ క్రీడల సంబురం పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో తడిసి ముద్దయిన క్రీడాభిమానులకు ఈసారి క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా కిక్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనుంది. చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ మహా సంగ్రామం, ఆసియా కప్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌‌‌‌‌‌‌‌లతో వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ పండగ చేసుకోనున్నారు. దీనికి తోడు విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో రెండు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. అయితే బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ డే టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఓటమితో పాత ఏడాదికి గుడ్‌‌‌‌‌‌‌‌ బై చెప్పిన టీమిండియా.. మళ్లీ ఆసీస్‌‌‌‌‌‌‌‌తోనే కొత్త ఏడాదిని మొదలుపెట్టబోతున్నది.

ఈ నెల 3 నుంచి 7 వరకు సిడ్నీలో ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌తో  రోహిత్‌‌‌‌‌‌‌‌సేన కొత్త క్రీడా సంవత్సరానికి స్వాగతం పలకనుంది. అయితే అన్నింటికి మించి చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీతో క్రికెట్‌‌‌‌‌‌‌‌ హీట్‌‌‌‌‌‌‌‌ మరో మెట్టు పైకి ఎక్కనుంది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌, అండర్‌‌‌‌‌‌‌‌–19 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌, ఆసియా కప్‌‌‌‌‌‌‌‌తో  ఈ ఏడాదిలో కూడా క్రికెట్‌‌‌‌‌‌‌‌ దూసుకుపోనుంది. ఇతర ఈవెంట్లలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు తక్కువే అయినా ప్రతి ఏడాది ఉండే టోర్నీలపై మరోసారి లుక్కేద్దాం..!

-  వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌