టీ20 కప్‌‌‌‌‌‌‌‌ గెలవాలె..ఆ సత్తా మాకుంది: హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్

టీ20 కప్‌‌‌‌‌‌‌‌ గెలవాలె..ఆ సత్తా మాకుంది: హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్
  • యూఏఈ బయల్దేరిన ఇండియా
  • 3 నుంచి విమెన్స్ టీ20 వరల్డ్ కప్

న్యూఢిల్లీ : వచ్చే నెలలో జరిగే విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో విజేతగా నిలవడమే తమ లక్ష్యమని టీమిండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేసింది. ఓ టీమ్‌‌‌‌‌‌‌‌గా దాన్ని సాధించడా నికి గట్టిగా పోరాడతామని చెప్పింది. ‘ కప్‌‌‌‌‌‌‌‌ గెలిచేందుకు అవసరమైనవన్నీ మా వద్ద ఉన్నాయి. దేశానికి, మాకు మద్దతిచ్చే వారికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలన్నదే మా ఆలోచన. ఇందుకోసం కచ్చితంగా కప్‌‌‌‌‌‌‌‌ గెలవాలె. ఈ ట్రోఫీని గెలవడం కూడా మా కల. అందుకే ఈ టోర్నీలో నిర్భయమైన క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు రెడీగా ఉన్నాం. కప్పు నెగ్గడం కోసం ఆడే ప్రతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తాం.  

2020లో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాం. 2023 సౌతాఫ్రికాలో దగ్గరగా వచ్చాం. కాబట్టి అతి పెద్ద స్టేజ్‌‌‌‌‌‌‌‌పై రాణించే సత్తా ఉందని ఈ రెండు టోర్నీలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు యూఏఈలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మేం ఎక్కడ ఆడినా ఫ్యాన్స్‌‌ నుంచి మద్దతు లభిస్తుంది. దుబాయ్‌‌‌‌‌‌‌‌, షార్జాలోనూ మాకు మద్దతిచ్చే వారు భారీ సంఖ్యలో ఉంటారని ఆశిస్తున్నాం’ అని మెగా టోర్నీ కోసం యూఏఈ బయల్దేరే ముందు  బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హర్మన్‌‌‌‌‌‌‌‌  తెలిపింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో ఇండియా 4న న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడనుంది. 

నేర్చుకోవాలనే తపన ఎక్కువ..

ఈ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేసిన జట్టులో సీనియర్స్‌‌ తో పాటు యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నారని హర్మన్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పోటీపడినప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో వాళ్లకు తెలుసని చెప్పింది. ‘యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ అందరికి మంచి అనుభవం వచ్చింది. టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన కొత్తవాళ్లకు నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంది. ఇది జట్టు బలాన్ని పెంచే అంశం. ప్లేయర్ల మధ్య పరస్పర స్నేహం, గౌరవం ఉంది. ఏ ఒక్కరూ వెనకబడిపోకుండా ఓ వ్యవస్థ అంతర్గతంగా పని చేస్తుంది. జట్టులో సానుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు సహాయక సిబ్బంది కూడా బాగా పని చేస్తున్నారు.  

ఈ విషయంలో వాళ్లను ప్రశంసించాల్సిందే’ అని కౌర్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించింది. గత టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ముగిసిన వెంటనే ఈ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ కోసం సన్నాహాలు మొదలుపెట్టామని తెలిపింది. ‘జట్టుకు స్పష్టమైన లక్ష్యం ఉంది. ఈ టోర్నీకి ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యేందుకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చాం. ఓవరాల్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌లో వాళ్లు భాగం కావాలని సూచించాం. ఇందులో ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ కూడా చాలా కీలకం కాబట్టి ప్రతి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ దాని ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. వాళ్ల పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌పై దాని ప్రభావాన్ని గుర్తించారు. ప్రత్యర్థి జట్టును బట్టి మా స్ట్రాటజీలు మారుతుంటాయి. అయితే మా బలం మేరకు ఆడటంపైనే మేం ఎక్కువగా దృష్టి పెట్టాం’ అని హర్మన్‌‌‌‌‌‌‌‌ వివరించింది. 

ఇప్పటికే చాలా వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్స్‌‌‌‌‌‌‌‌ ఆడిన తాను 19 ఏండ్ల వయసులో ఉన్నంత ఉత్సాహాన్ని కలిగి ఉన్నానని వెల్లడించింది. కాగా, ఈ టోర్నీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురవనుంది. గత ఐసీసీ టోర్నీల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాపై ఆ జట్లు పైచేయి సాధించాయి.  కానీ, తమదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడిస్తామనని హర్మన్ చెప్పింది. తమను ఓడించగల జట్టు ఏదైనా ఉందంటే అది ఇండియానే అని ఆసీస్‌‌కు కూడా  తెలుసని తెలిపింది.