IND Vs AUS: ఇదీ హిట్‌మ్యాన్ అంటే.. సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయం!

IND Vs AUS: ఇదీ హిట్‌మ్యాన్ అంటే.. సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయం!

సీనియర్ల విషయంలో ఇంత అలసత్వం ఎందుకు..? ఆడనప్పుడు తప్పించలేరా..! కెప్టెన్ అయినంత మాత్రాన ఆడకున్నా జట్టులో కొనసాగిస్తారా..! వంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఫేలవ ఫామ్‌తో సతమతమవుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ తనకు తానుగా జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని సమాచారం. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఆఖరి టెస్టులో హిట్‌మ్యాన్ బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నారట. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఈ ప్రశ్నకు సమాధానం దాటవేయడం ఆ వార్తలకు మరింత బలాన్నిచేకూరుస్తోంది. 

తుస్సుమంటున్న హిట్‌మ్యాన్‌

గత కొంతకాలంగా రోహిత్‌ పరుగులు సాధించడంలో దారుణంగా విఫలమవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అదే ప్రదర్శన. ఆస్ట్రేలియా గడ్డపైనా అదే ఆట. గత మూడు సిరీస్‌లో 15 ఇన్నింగ్స్‌ల్లో 10.93 సగటుతో 164 పరుగులు చేశాడు. అందునా ఈ మూడింటిలో రెండు సొంగడ్డపై జరిగినవే. ఇక ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో 3 మ్యాచ్‌ల్లో ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు.. 10. సుధీర్ఘ క్రికెట్‌లో ఇవి ఏమాత్రం ఆమోదించదగిన గణాంకాలు కావు. దాంతో, అతన్ని పక్కన పెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది.

ALSO READ | IND vs AUS: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. ఆఖరి టెస్టుకు స్టార్ పేసర్ దూరం

రోహిత్ కెప్టెన్ కనుక అతన్ని తప్పించే సాహసం ఎవరూ చేయరు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ తనకు తానుగా జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఒకవేళ రోహిత్ తప్పుకుంటే, జట్టును స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. 

సిడ్నీ టెస్టుకు భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ క్రిష్ణ, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్.