న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ కోసం ముందుగానే యూఎస్ఏ వెళ్లనున్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుకోకపోవడంతో ఆ టీమ్‌లో ఉన్న ఈ ముగ్గురూ అమెరికా వెళ్లి మెగా టోర్నీకి సన్నద్ధం కానున్నారు. ఐపీఎల్లో ప్లేఆఫ్స్ ఆడని జట్లలోని టీమిండియా ప్లేయర్లను
(వరల్డ్ కప్‌కు ఎంపికైన వాళ్లు) మొత్తం జట్టుతో కాకుండా ఈ నెల 24న తొలి విడతగా యూఎస్ఏకు పంపిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. వీరితో పాటు కోచింగ్ స్టాఫ్ వెళ్తారని చెప్పారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత మిగతా జట్టును పంపించేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 2న టీ20 వరల్డ్ కప్ మొదలవుతుంది.