ఆస్ట్రేలియాతో  బోర్డర్ –గావస్కర్ ట్రోఫీకి ..రోహిత్ శర్మ దూరం

ఆస్ట్రేలియాతో  బోర్డర్ –గావస్కర్ ట్రోఫీకి ..రోహిత్ శర్మ దూరం

ముంబై : ఆస్ట్రేలియాతో  బోర్డర్ –గావస్కర్ ట్రోఫీలో  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. ఈ సిరీస్‌‌‌‌ కోసం ఆదివారం తొలి విడతా కొందరు ప్లేయర్లు ముంబై నుంచి ఆసీస్‌‌‌‌కు ప్రయాణం అయ్యారు. సోమవారం రెండో బ్యాచ్‌‌‌‌ వెళ్లనుంది. తన భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో రోహిత్ టీమ్‌‌‌‌తో  కలిసి ఆసీస్‌‌‌‌కు వెళ్లడం లేదు.

ఈ నెల 22న పెర్త్‌‌‌‌లో తొలి టెస్టు మొదలవనుంది. అయితే, రోహిత్ మూడో వారంలో జట్టుతో కలుస్తాడని,ఈ నేపథ్యంలో తను తొలి టెస్టుకు దూరం అవుతాడని ఇప్పుడే ప్రకటించలేమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.