స్నేహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా 8/77

స్నేహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా 8/77
  •     ఫాలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా
  •     రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 232/2

చెన్నై :  సౌతాఫ్రికా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా ఆధిపత్యమే కొనసాగుతోంది. స్నేహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా (8/77) స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుదేలైన సఫారీలు ఫాలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడ్డారు. అయితే రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సునె లుస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (109), లారా వోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (99 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నిలకడగా ఆడటంతో ప్రొటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్త గాడిలో పడింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు 236/4తో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 84.3 ఓవర్లలో 266 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు మరిజనే కాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (74), డిక్లెర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (39) మెరుగ్గా ఆడారు.

డే స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన స్నేహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఘోరంగా దెబ్బకొట్టింది. కేవలం 17 రన్స్ తేడాతో ఆరు వికెట్లు తీయడంతో ప్రొటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫాలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పలేదు. దీప్తి శర్మ (2/47) అండగా నిలిచింది. మొత్తం ఎనిమిది వికెట్లు తీసిన స్నేహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా.. ఇండియా తరఫున నీతూ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (8/53) తర్వాత అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నీతూ, ఆష్లే గాడ్నెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (8/66) తర్వాతి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.

ఇక స్నేహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకు ఫాలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 85 ఓవర్లలో 232/2 స్కోరు చేసింది. 16 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అనెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9) వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయిన ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లుస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లారా ఆదుకున్నారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 190 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించారు. లారాతో పాటు కాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (15 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ప్రొటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంకా 105 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది.