సుప్రీం కోర్టులో అజరుద్దీన్‌‌‌‌కు ఎదురుదెబ్బ

సుప్రీం కోర్టులో  అజరుద్దీన్‌‌‌‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ, వెలుగు: టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌, హెచ్‌‌‌‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌‌‌‌ అజరుద్దీన్‌‌‌‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 20న జరిగే హెచ్‌‌‌‌సీఏ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలన్న అజర్‌‌‌‌ అభ్యర్థనను జస్టిస్‌‌‌‌ సంజయ్‌‌‌‌ కిషన్‌‌‌‌ కౌల్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ సుధాంశు ధూలియాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పటికే ఓటర్ల జాబితా ఫైనల్‌‌‌‌ అయినందున ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. 

ఈ కేసును ఈ నెల 31కి వాయిదా వేసింది. హెచ్‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌గా ఉంటూ డెక్కన్​ బ్లూస్​ క్రికెట్‌‌‌‌ క్లబ్‌‌‌‌ అధ్యక్షుడిగా కూడా పని చేసినందుకు జస్టిస్‌‌‌‌ లావు నాగేశ్వరరావు ఏక సభ్య కమిటీ అజర్‌‌‌‌పై అనర్హత వేటు వేసింది. ఫలితంగా అజర్‌‌‌‌ పేరును ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ నుంచి తొలగించింది. దీనిపై మాజీ క్రికెటర్‌‌‌‌ సుప్రీంను ఆశ్రయించారు. కానీ ఈ పిటిషన్​ విచారణ ఈ నెలాఖరుకు వాయిదా పడిన నేపథ్యంలో ఈ నెల 20న హెచ్​సీఏ ఎన్నికల్లో అజర్ పోటీపడే చాన్స్ లేకుండా పోయింది.