2023లో విజయ యాత్ర కొనసాగిస్తున్న టీమిండియా...న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డేలోనూ విజయం సాధించింది. భారత్ 90 పరుగుల తేడాతో గెలవడంతో వన్డేల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే లంకతో జరిగిన వన్డే సిరీస్ను 3-0తో సొంతం చేసుకున్న రోహిత్ సేన...తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను కూడా 3-0తో గెలిచి... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ టీమ్గా నిలిచింది.
హైదరాబాద్, రాయ్ పూర్ లలో జరిగిన వన్డేల్లో గెలిచిన భారత జట్టు..ఇండోర్ లో జరిగిన చివరి వన్డేలో ఏకంగా 90 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తంగా 114 రేటింగ్తో భారత జట్టు..అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 44 మ్యాచులు ఆడిన టీమిండియా మొత్తం 5010 పాయింట్లతో 114 రేటింగ్ సాధించింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా...ఆస్ట్రేలియా 112 రేటింగ్తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత్ చేతిలో క్వీన్ స్వీప్ కావడంతో న్యూజిలాండ్ రెండు రేటింగ్ పాయింట్లు కోల్పోయి 111 స్కోరుతో 4వ స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో పాకిస్థాన్ 106 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.