IND Vs NZ: భారత జట్టులో వాషింగ్ టన్ సుందర్.. కారణం ఏంటంటే..?

IND Vs NZ: భారత జట్టులో వాషింగ్ టన్ సుందర్.. కారణం ఏంటంటే..?

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత్ పై స్వదేశంలో 36 ఏళ్ళ తర్వాత గెలిచిన కివీస్.. దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అక్టోబరు 24న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ జరగనుంది. ఈ టెస్టు కోసం భారత జట్టులో యువ ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ స్థానం దక్కించుకున్నాడు. జట్టులో అశ్విన్, అక్షర్ పటేల్, జడేజా లాంటి స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ మరో స్పిన్ ఆల్ రౌండర్  సుందర్ ను ఎంపిక చేయడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. 

టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తండ్రి కాబోతున్నాడు. అతని భార్య మేహా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ఇటీవలే  స్పష్టం చేశాడు. సోమవారం(అక్టోబర్ 7) ఇంస్టాగ్రామ్ వేదికగా అతను అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ కారణంగా అక్షర్ చివరి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అతని స్థానంలో మరో స్పిన్ ఆల్ రౌండర్ కావాలి. అందుకే సెలక్టర్లు భారత జట్టులో సుందర్ ను ఎంపిక చేశారు. 

ALSO READ  : 36 ఏండ్ల తర్వాత..ఇండియా గడ్డపై న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు టెస్టు విజయం

ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతూ సుందర సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 152 పరుగులు చేసి సత్తా చాటాడు. బౌలింగ్ లోనూ మెరిసి రెండు వికెట్లు తీశాడు. 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా చివరి టెస్టులో సుందర్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి టెస్టులోనే అద్భుతంగా రాణించాడు. అర్ధ సెంచరీ చేయడంతో పాటు.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా కీలకమైన నాలుగో టెస్ట్ గెలవడంతో ప్రధాన పాత్ర పోషించాడు.

 
న్యూజిలాండ్ తో రెండో టెస్టుకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్  సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్.