ODI World Cup 2023: దుమ్మురేపుతున్న భారత్.. ఆరుకు ఆరు విక్టరీతో సెమీస్కు టీమిండియా

ODI World Cup 2023: దుమ్మురేపుతున్న భారత్.. ఆరుకు ఆరు విక్టరీతో సెమీస్కు టీమిండియా
  • సెమీస్​కు భారత్​! ఆరుకు ఆరు..
  • ఆరో విక్టరీతో సెమీస్‌‌‌‌కు టీమిండియా!             
  • 100 రన్స్‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్ చిత్తు
  • రాణించిన రోహిత్, సూర్య, చెలరేగిన షమీ, బుమ్రా
  • అదే జోరు.. అదే హోరు

మూడోసారి వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నెగ్గాలన్న టార్గెట్‌‌‌‌ దిశగా టీమిండియా దూసుకెళ్తోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తోంది. గత ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో ఛేజింగ్‌‌‌‌లో గెలిచిన టీమిండియా ఈసారి ఖతర్నాక్ బౌలింగ్‌‌‌‌తో కేక పుట్టించింది. టాప్‌‌‌‌4 బ్యాటర్లలో ముగ్గురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే ఔటైనా కెప్టెన్​ రోహిత్​ శర్మ  (101 బాల్స్​లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87) జట్టును ఆదుకోగా.. చిన్న స్కోరుకు కాపాడుకునే క్రమంలో మహ్మద్​ షమీ (4/22), బుమ్రా (3/32) తమ పేస్‌‌‌‌తో ఇంగ్లండ్‌‌‌‌ను హడలెత్తించారు. దాంతో వరుసగా ఆరో విక్టరీతో సిక్సర్ కొట్టిన ఇండియా మళ్లీ టాప్‌ ప్లేస్‌కు వచ్చి సెమీఫైనల్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. ఇంకోవైపు వరుసగా నాలుగో, మొత్తంగా ఐదో ఓటమితో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అట్టడుగు స్థానానికి పడిపోయి లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టేందుకు సిద్ధమైంది.

వన్డే వరల్డ్ కప్‌‌లో టీమిండియా వరుసగా ఆరో విజయంతో సిక్సర్​ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా100  రన్స్ తేడాతో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ఇంగ్లండ్‌‌ను చిత్తు చేసింది. ఆరో విజయంతో పాయింట్స్ టేబుల్లో మళ్లీ టాప్​ ప్లేస్‌‌కు వచ్చి సెమీఫైనల్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్​లో మొదట ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 229/9 స్కోరు చేసింది. రోహిత్​ శర్మ  (87) సత్తా చాటాడు. చేజింగ్‌‌లో మహ్మద్​ షమీ (4/22), జస్‌‌ప్రీత్​ బుమ్రా (3/32) దెబ్బకు ఇంగ్లండ్  34.5 ఓవర్లలో 129 రన్స్‌‌కే ఆలౌటై ఓడిపోయింది. టోర్నీలో ఐదో ఓటమితో చివరి ప్లేస్‌‌కు పడిపోయింది. రోహిత్​ శర్మకు ప్లేయర్‌‌‌‌ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

లక్నో: వన్డే వరల్డ్ కప్‌‌‌‌లో టీమిండియా విజయ యాత్ర కొనసాగుతోంది.   ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో రోహిత్‌‌‌‌సేన 100  రన్స్ తేడాతో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ను చిత్తు చేసింది. వరుసగా ఆరో విక్టరీతో సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 229/9 స్కోరు చేసింది.  రోహిత్‌‌‌‌తో పాటు సూర్యకుమార్​ యాదవ్​ (47 బాల్స్​లో 4 ఫోర్లు, 1 సిక్స్​తో 49), కేఎల్​ రాహుల్​ (58 బాల్స్​లో 3 ఫోర్లతో 39) రాణించారు. ఇంగ్లండ్​ బౌలర్లలో డేవిడ్​ విల్లీ  మూడు, క్రిస్​ వోక్స్​, ఆదిల్​ రషీద్​ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌‌‌లో  ఇంగ్లండ్  34.5 ఓవర్లలో 129 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడింది. లివింగ్‌‌‌‌స్టోన్ (27) టాప్‌‌‌‌ స్కోరర్. షమీ, బుమ్రా కు తోడు కుల్దీప్​ (2/24) సత్తా చాటాడు. రోహిత్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది. గురువారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌లో శ్రీలంకతో ఇండియా పోటీ పడనుంది.

టాప్‌‌‌‌లో రోహిత్​..మిడిల్‌‌‌‌లో సూర్య

గత మ్యాచ్‌‌‌‌ల్లో ఛేజింగ్​చేసిన టీమిండియా టోర్నీలో తొలిసారి ఫస్ట్​ బ్యాటింగ్​చేసి తడబడింది. టాపార్డర్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్​ రోహిత్.. ​ మిడిల్​లో సూర్యకుమార్, కేఎల్‌‌‌‌ రాహుల్​ పట్టుదలగా ఆడి జట్టుకు కాపాడుకునే స్కోరు అందించారు. విల్లీ వేసిన ఫస్ట్​ ఓవర్లో ఆరు డాట్​ బాల్స్​ ఆడిన రోహిత్​ అతని  తర్వాతి ఓవర్లో వరుసగా 4,6తో  టచ్‌‌‌‌లోకి వచ్చాడు. కానీ, నాలుగో ఓవర్లోనే గిల్​ (9)ను బౌల్డ్​ చేసిన వోక్స్​ ఇండియాకు షాకిచ్చాడు.  తొమ్మిది బాల్స్‌‌‌‌లో ఖాతా తెరువలేకపోయిన విరాట్ కోహ్లీ (0) విల్లీ బౌలింగ్‌‌‌‌లో స్టోక్స్‌‌‌‌కు ఈజీ క్యాచ్​ ఇవ్వడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారింది. 

నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్​ (4) కూడా ఫెయిలయ్యాడు. వోక్స్ వేసిన లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌ను లైన్‌‌‌‌కు అడ్డంగా ఆడి మార్క్‌‌‌‌వుడ్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో 12 ఓవర్లకు ఇండియా 40/3తో కష్టాల్లో పడ్డది. ఈ టైమ్‌‌‌‌లో  కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ తోడుగా రోహిత్​ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దాడు. క్రీజులో కుదురుకునేందుకు కేఎల్‌‌‌‌ టైమ్‌‌‌‌ తీసుకోగా.. హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ  ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో 66 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ దాటిన అతను వెంటనే గేరు మార్చాడు. తర్వాతి బాల్‌‌‌‌నే ఫైన్‌‌‌‌ లెగ్‌‌‌‌ మీదుగా సిక్స్‌‌‌‌ కొట్టాడు. 

లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ వేసిన 25వ ఓవర్లో కేఎల్‌‌‌‌ రాహుల్​ రెండు బౌండ్రీలతో జోరందుకోవడంతో ఇండియా స్కోరు వంద దాటింది. ఇద్దరూ క్రీజులో కుదురుకోవడంతో హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ మంచి స్కోరు చేసేలా కనిపించింది. కానీ, సెకండ్‌‌‌‌ స్పెల్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన విల్లీ తన రెండో బాల్‌‌‌‌కే కేఎల్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి నాలుగో వికెట్‌‌‌‌కు 91 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్​ బ్రేక్‌‌‌‌ చేశాడు.  మిడిల్‌‌‌‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసిన ఆదిల్ రషీద్​ మరో సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌‌‌‌ను ఔట్ చేశాడు. ఓ ఎండ్‌‌‌‌లో సూర్య కుమార్ నిలకడగా ఆడినా  మరోవైపు అతనికి సహకారం కరువైంది. 

ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ జడేజా (8)ను కూడా రషీద్ వెనక్కు పంపగా.. మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో షమీ (1) కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. వుడ్‌‌‌‌ వేసిన 46వ ఓవర్లో సిక్స్‌‌‌‌తో సూర్య ఇండియా స్కోరు 200 దాటించాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే విల్లీ ఫుల్ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌కు ఔటై ఫిఫ్టీకి ఒక్క రన్​ దూరంలో నిలిచిపోయాడు. చివర్లో బుమ్రా (16),  కుల్దీప్‌‌‌‌ (9 నాటౌట్) విలువైన రన్స్‌‌‌‌ అందించి టీమ్‌‌‌‌ ఆలౌట్‌‌‌‌ కాకుండా చూశారు.

బౌలర్ల జోరు

చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌కు వచ్చిన ఇంగ్లండ్‌‌‌‌  ఏ దశలోనూ  ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఆ టీమ్‌ను పేసర్లు బుమ్రా, షమీ వణికించారు. కొత్త బాల్‌‌‌‌తో  ఫస్ట్ స్పెల్‌‌‌‌లో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసిన ఈ ఇద్దరూ టాపార్డర్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టారు. ఓపెనర్లు బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో (14), డేవిడ్ మలన్ (16) తొలి వికెట్‌‌‌‌కు 30 రన్స్‌‌‌‌ జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ, ఐదో ఓవర్లో వరుస బాల్స్‌‌‌‌లో మలన్‌‌‌‌, రూట్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేసిన బుమ్రా ఇంగ్లండ్‌‌‌‌కు డబుల్ షాక్‌‌‌‌ ఇచ్చాడు. తొలి రెండు ఓవర్లలో సిరాజ్ ఎక్కువ రన్స్‌‌‌‌ ఇవ్వడంతో అతని ప్లేస్‌‌‌‌లో కెప్టెన్​ రోహిత్‌‌‌‌ శర్మ షమీని బరిలోకి దింపడం మాస్టర్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ అయింది. 

వరుసగా తొమ్మిది డాట్స్‌‌‌‌ వేసి ఒత్తిడి పెంచిన  షమీ వరుస బాల్స్‌‌‌‌లో బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (0), బెయిర్‌‌‌‌‌‌‌‌స్టోను బౌల్డ్‌‌‌‌ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. కొద్దిసేపటికే స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ కుల్దీప్ సూపర్ టర్నర్‌‌‌‌‌‌‌‌తో కెప్టెన్​ బట్లర్‌‌‌‌‌‌‌‌ (10)ను బౌల్డ్‌‌‌‌ చేయడంతో ఇంగ్లండ్​ 52/5తో ఎదురీత మొదలు పెట్టింది. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో లివింగ్‌‌‌‌స్టోన్ (27),  మొయిన్‌‌‌‌ అలీ (15) కాసేపు ప్రతిఘటించారు. కానీ, సెకండ్‌‌‌‌ స్పెల్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన షమీ.. కీపర్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో అలీని ఔట్ చేసి మరో బ్రేక్‌‌‌‌ ఇచ్చాడు. ఆ వెంటనే జడేజా బౌలింగ్‌‌‌‌లో క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ (10) స్టంపౌట్ అవ్వగా.. తర్వాతి ఓవర్లోనే స్ట్రెయిట్‌‌‌‌ బాల్‌‌‌‌తో లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ను ఎల్బీ చేసిన కుల్దీప్‌‌‌‌ ఇండియా విజయం ఖాయం చేశాడు. చివర్లో షమీ బౌలింగ్‌‌‌‌లో ఆదిల్ (13), బుమ్రా బౌలింగ్‌‌‌‌లో మార్క్‌‌‌‌ వుడ్ (0) బౌల్డ్‌‌‌‌ అవ్వడంతో ఇంగ్లండ్ పోరాటం ముగిసింది.

వరల్డ్‌‌‌‌ కప్స్‌‌‌‌లో ఇండియాకు ఇది 59వ విజయం. న్యూజిలాండ్ (58)ను దాటి రెండో ప్లేస్‌‌‌‌కు వచ్చింది. ఆస్ట్రేలియా 73 విక్టరీలతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉంది. ఒక వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఇంగ్లండ్ వరుసగా నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడటం ఇదే తొలిసారి.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 50 ఓవర్లలో 229/9 (రోహిత్ 89, సూర్య 49, విల్లీ 3/45, వోక్స్ 2/33).
ఇంగ్లండ్: ఇంగ్లండ్  34.5 ఓవర్లలో 129 ఆలౌట్​(లివింగ్‌‌‌‌స్టోన్ 27, షమీ 4/22, బుమ్రా 3/22).