Asia Cup 2024: మిషన్ ఆసియా క‌ప్.. శ్రీ‌లంక‌ ఫ్లైటెక్కిన భారత మహిళలు

Asia Cup 2024: మిషన్ ఆసియా క‌ప్.. శ్రీ‌లంక‌ ఫ్లైటెక్కిన భారత మహిళలు

జూలై 19 నుంచి శ్రీ‌లంక‌ వేదికగా ఆసియా క‌ప్‌ 2024 టోర్నీ ప్రారంభం కానుంది. ఆసియన్ దేశాలు తలపడే ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మంగళవారం(జులై 16) శ్రీ‌లంక‌కు బయలుదేరి వెళ్లింది. త‌మ ప‌ర్యట‌న‌కు సంబంధించిన ఫొటోల‌ను క్రికెట‌ర్లు తమ సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగ‌నుంది.  

ALSO READ | లక్నో కెప్టెన్సీ నుంచి రాహుల్ ఔట్..? అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మొత్తం ఎనిమిది జట్లు తలపడే ఈ టోర్నీని రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. గ్రూప్‌‌‌‌–ఎలో ఇండియా, పాకిస్తాన్‌‌‌‌, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూప్‌‌‌‌–బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌‌‌‌, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌, మలేసియా జట్లు ఉన్నాయి.

హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో..

ఆసియా క‌ప్ కొరకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ప‌దిహేను మంది సభ్యులు గల జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. వీరితో పాటు మ‌రో న‌లుగురు ట్రావెల్ రిజ‌ర్వ్‌ ప్లేయర్లు జట్టు వెంటే వెళ్లారు. జూలై 19వ తేదీన టోర్నీ ఆరంభం కానుండ‌గా.. ఆ మ‌రుసటి రోజే జూలై 20న‌ భార‌త జ‌ట్టు చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (డబ్ల్యుకె), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్

ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్.