టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా

టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు  ఆస్ట్రేలియా  వెళ్లిన  టీమిండియా

టీ20 వరల్డ్ కప్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. ముంబై ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లింది. ఇక టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన  క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్ సూటు..బూటుతో మెరిసిపోయారు. ఓ వైపు క్రికెటర్లు..మరో వైపు కోచ్ ద్రవిడ్తో సహా స్టాఫ్ నిల్చోని..ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. పిక్చర్‌ పర్ఫెక్ట్‌, నం సాధిద్దాం, వరల్డ్‌కప్‌, వచ్చేస్తున్నాం అంటూ బీసీసీఐ క్యాప్షన్ పెట్టింది. మొత్తంగా 14 మంది ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు. అయితే గాయం కారణంగా బుమ్రా వైదొలగడంతో...అతని ప్లేస్లో బీసీసీఐ ఎవరినీ ప్రకటించలేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక..రిజర్వ్ ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్తారు. 

పటేల్, చాహల్తో కోహ్లీ ఫోటో..
ఆస్ట్రేలియా విమానం ఎక్కేముందు క్రికెటర్లు ఫోటోలు దిగి సందడి చేశారు. విరాట్‌ కోహ్లి, హర్షల్‌ పటేల్‌, చాహల్‌లతో  సెల్పీ దిగాడు. ఈ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియా వెళ్తున్నాం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 

సూర్య స్మైల్..
టీమిండియా 360 డిగ్రీ బ్యాట్స్మన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఫోటోతో హల్ చల్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, పంత్, దినేష్ కార్తీక్లతో కెమెరాకు పోజులిస్తూ ఫోటో దిగాడు.  ఈ ఫోటోను తన ఇస్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. 

డికే..విత్ పాండ్యా..
ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా కెమెరాకు పోజిచ్చాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్తో కలిసి ఫోటో దిగిన అతను..ఆ తర్వాత సింగల్గా మరో ఫోటో దిగి పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియా వెళ్తున్నాం..అనుకున్నది సాధిద్దాం అంటూ క్యాప్షన్ పెట్టాడు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్లిన భారత క్రికెటర్లు..ముంబై ఎయిర్ పోర్టులో ఉత్సాహంగా..ఉల్లాసంగా కనిపించారు. 

పాక్తో ఫస్ట్ మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16న మొదలనుంది. ఫస్ట్ మ్యాచ్ లో శ్రీలంకతో నమీబియా తలపడనుంది. ఇక టీమిండియా తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ తో ఆడనుంది. అక్టోబర్ 23న  ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 27న భారత్ రెండో మ్యాచ్‌ ఆడనుంది. అక్టోబర్ 30న  సౌతాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. నవంబర్ 6న భారత్ మరో మ్యాచ్‌ ఆడనుంది.