టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. కీలకమైన సూపర్-8 పోరుకు ముందు పసికూన కెనడాతో తలపడనుంది. శనివారం( జూన్ 15) సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం(లాడర్‌హిల్, ఫ్లోరిడా) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచిన కెనడా..టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన భారత్‌కు ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికర అంశం. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన.. కెనడాను ఓడించగలిగితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా శ్రీలంక సరసన చేరనుంది.
కెనడాతో మ్యాచ్ మెన్ ఇన్ బ్లూకి ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. ఇందులో విజయం సాధిస్తే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక ప్రపంచ రికార్డును సమం చేసే వీలుంది. ఇప్పటివరకు తొమ్మిది టీ20 ప్రపంచకప్‌లలో, శ్రీలంక 53 మ్యాచ్‌ల్లో 32 విజయాలు సాధించింది. అదే సమయంలో భారత జట్టు 47గాను 31 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ జాబితాలో పాకిస్థాన్ (29 విజయాలు), ఆస్ట్రేలియా (28 విజయాలు), దక్షిణాఫ్రికా (43 మ్యాచ్‌ల్లో 27 విజయాలు) తరువాత స్థానాల్లో ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలు
- శ్రీలంక: 32 విజయాలు; 21 అపజయాలు (53 మ్యాచ్‌లు) -
- భారత్: 31 విజయాలు; 15 అపజయాలు; 1 ఫలితం తేలనివి (47 మ్యాచ్‌లు)
- పాకిస్తాన్: 29 విజయాలు; 19 అపజయాలు; 2 ఫలితం తేలనివి (50 మ్యాచ్‌లు)
- ఆస్ట్రేలియా: 28 విజయాలు; 15 అపజయాలు (43 మ్యాచ్‌లు)
- దక్షణాఫ్రికా: 28 విజయాలు; 15 అపజయాలు; 1 ఫలితం తేలనివి (44 మ్యాచ్‌లు)
- ఇంగ్లండ్: 25 విజయాలు; 20 అపజయాలు; 2 ఫలితం తేలనివి (47 మ్యాచ్‌లు)
- న్యూజిలాండ్: 24 విజయాలు; 19 అపజయాలు; 2 ఫలితం తేలనివి (45 మ్యాచ్‌లు)