ఐసీసీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో దీప్తి శర్మ @ 5

ఐసీసీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో దీప్తి శర్మ @ 5

దుబాయ్‌ ‌‌‌‌‌‌‌: టీమిండియా ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ.. ఐసీసీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో దీప్తి (665) ఒక్క స్థానం మెరుగుపడి ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. ఇటీవల వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో దీప్తి 8 వికెట్లు తీయడం ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది. బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన (720) ఒక్క ర్యాంక్‌‌‌‌‌‌‌‌ కిందకు పడి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.

లారా వోల్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ (733), చామిరి ఆటపట్టు (733) వరుసగా తొలి రెండు ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు. జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ (537) 22వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకురాగా, రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ (448) ఏడు స్థానాలు పైకి  ఎగబాకి 41వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ మూడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.