కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై అతిగా ఆధారపడొద్దు..సొంతంగా పరిష్కారాలను కనుగొనలేం : అశ్విన్‌‌

కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై అతిగా ఆధారపడొద్దు..సొంతంగా పరిష్కారాలను కనుగొనలేం : అశ్విన్‌‌

న్యూఢిల్లీ : కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ఎక్కువగా ఆధారపడితే.. సొంతంగా పరిష్కారాలను కనుగొనలేమని టీమిండియా ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నాడు. దానివల్ల మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోలేకపోతామన్నాడు. ‘చాలా మంది ప్లేయర్లు.. కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మెంటార్లపై అతిగా ఆధారపడతారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. వ్యక్తులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల మనలో కొత్త ఆలోచనలు రావు. ఏ విషయాన్ని కూడా సొంతంగా పరిష్కరించుకోలేం. ఒక కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనేక సవాళ్లకు పరిష్కారం చూపించొచ్చు. కానీ అది అందరికీ పని చేస్తుందని భావించొద్దు.

అందుకే ఆధునిక కోచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తత్వశాస్త్రంతో నేను ఏకీభవించను. ఒక క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పని చేసిన టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే మిగతా వారికి కూడా కాపీ పేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రయత్నిస్తారు. కానీ ఓ ప్రత్యేకమైన వ్యక్తికి ఇది పని చేయకపోవచ్చు. అందుకే సొంతంగా ఆలోచించే తత్వాన్ని అలవర్చుకోవాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిరంతరం సవాళ్లను ఎదుర్కొనే వాళ్లు సొంతంగానే పరిష్కారం వెతుక్కుంటే బాగుంటుందన్నాడు. ‘కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సహాయం మాత్రమే చేస్తారు. కానీ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి మనకు మార్గనిర్దేశనం చేయరు. కొత్త ఆలోచనలకు మనమే తెర తీయాలి. నా కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్ల్యూవీ రామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు బాగా సహకరించాడు. నేను ఏ మార్గంలో ప్రయాణించాలో చెప్పాడు.

కానీ ఇదే మార్గంలో ప్రయాణించాలనే కండిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టలేదు. కాబట్టి నా క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రోజుల్లో రామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన మార్గదర్శకత్వమే నేను ఎవరిపై ఆధారపడకుండా చేసింది’ అని ఈ తమిళనాడు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. ఏ ఆటలోనైనా సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒపీనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పు కాదని అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. అయితే క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం సొంతంగా నేర్చుకుంటేనే పైకి ఎదుగుతామన్నాడు. ‘ఆట గురించి సొంత అవగాహన లేకున్నా, నేర్చుకోవాలనే తపన లేకపోయినా మనం ప్రతిసారి ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. 

ఇది చాలా ప్రమాదకరం. కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్న వ్యక్తులు జీవితంలో బాగా రాణించలేరని నేను చెప్పను. కానీ మనల్ని మనం నమ్ముకునే అవకాశం తక్కువగా ఉంటుంది’ అని అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డాడు.

గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ హీరో..

టీమిండియా కొత్త కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తనకు మంచి అనుబంధం ఉందని అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపాడు. గౌతీ చాలా ముక్కుసూటి, నిజాయితీ గల వ్యక్తి అని కితాబిచ్చాడు. ‘ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఒక హీరో. అతనికి మనం ఎప్పుడూ మద్దతుగా నిలవాలి’ అని అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.  ఇక తన ప్రధాన అస్త్రమైన ‘క్యారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను నేర్చుకోవడానికి 2 నుంచి 3 ఏండ్లు పట్టిందన్నాడు. చెన్నైలో జరిగిన ఓ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అజంతా మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శ్రీలంక) బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసిన తర్వాత నేను క్యారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసేందుకు ప్రయత్నించానని చెప్పాడు.

‘నేను 2006, 2007 నుంచి నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తున్నా. అప్పుడు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాకు అది రెండో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 2008లో విజయ్ హజారే ట్రోఫీ సౌత్ జోన్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో దాన్ని ప్రయోగించా. పూర్తి స్థాయిలో వేయడానికి రెండేండ్లు పట్టింది. 2010 నాటికి దానిపై పట్టు దొరికింది’ అని అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరించాడు. ఇండియాకు ఆడటమే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పిన అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యువ క్రికెటర్ల జీవితాలను మార్చేసిందన్నాడు. అయితే యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇండియాకు ఆడాలనే లక్ష్యంతోనే ఉండాలని సూచించాడు.