అహ్మదాబాద్: ఈ వరల్డ్ కప్‌లో తన బౌలింగ్ అసాధారణంగా ఏమీ లేదని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ స్పష్టం చేశాడు. కేవలం స్టంప్ టు స్టంప్ లెంగ్త్‌పై దృష్టి పెట్టి ఒకే జోన్‌లో బాల్స్ వేశానని చెప్పాడు. దానివల్లే తనకు వికెట్లు లభించాయన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో షమీ 5.01 ఎకానమీతో 22 వికెట్లు తీశాడు.
ఇందులో మూడు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. ‘పిచ్ ఎలా ఉంది. బాల్ స్వింగ్ అవుతుందా? లేదా? మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంది. ఇలాంటి అంశాలపైనే నేను ఎక్కువగా దృష్టి పెడతా. ఒకవేళ బాల్ స్వింగ్ కాకపోతే స్టంప్స్ లక్ష్యంగా బాల్స్ వేసేందుకు ప్రయత్నిస్తా. బ్యాటర్ డైవ్ చేస్తే బ్యాట్ ఎడ్జ్ తీసుకునేలా ఒకే జోన్‌లో బంతులు విసురుతా’ అని షమీ పేర్కొన్నాడు.