T20 World Cup 2024: కలిసి రాని కరేబియన్ గడ్డ.. వెస్టిండీస్‌లో టీమిండియాకు చేదు జ్ఞాపకాలు

T20 World Cup 2024: కలిసి రాని కరేబియన్ గడ్డ.. వెస్టిండీస్‌లో టీమిండియాకు చేదు జ్ఞాపకాలు

యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ, వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ వేదికగా  ఆదివారం (ఇండియా టైమ్ ప్రకారం) మొదలయ్యే తాజా ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొన్ని మార్పులు మినహా 2022 టోర్నీలోని మెజారిటీ ప్లేయర్లే జట్టులో ఉన్నారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో కూడిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో ఉన్న ఇండియా ఈ నెల 5న ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌తో తన పోరు ఆరంభిస్తుంది. యూఎస్‌‌‌‌‌‌‌‌ఏలో తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌ను దాటడం లాంఛనమే అయినా.. విండీస్ గడ్డపై సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌8లోనే ఇండియాకు అసలు సవాల్ ఎదురవనుంది. 

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ లీగ్ మొదలైనప్పటి నుంచి టీమిండియా టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గింది లేదు. సౌతాఫ్రికాలో జరిగిన తొలి ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో సక్సెస్ తర్వాత ఇండియా 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరి రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టింది. ఇక, 2011లో వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌, 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత  గత 11 ఏండ్లలో మన టీమ్ మరో ఐసీసీ కప్పు నెగ్గలేకపోయింది. గతేడాది ఐసీసీ టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌, వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరి ఆశలు రేపినా.. రెండింటిలోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో సగటు అభిమానిని తీవ్ర నిర్వేదానికి గురి చేసింది.  దాంతో ఈ టోర్నీలో అయినా ఇండియా కప్పు నెగ్గాలని ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ కోరుకుంటున్నారు.

2010 టీ20 వరల్డ్ కప్:

వెస్టిండీస్ వేదికగా జరిగిన 2010 T20 వరల్డ్ కప్ భారత్ సెమీస్ కు చేరలేకపోయింది. గ్రూప్ స్టేజ్ లో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాలని ఓడించి శుభారంభం చేసినా.. సూపర్ 8 దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి  ఇంటిదారి పట్టింది. 

2007 వన్డే వరల్డ్ కప్:

వరల్డ్ కప్ చరిత్రలో భారత్ కు ఈ టోర్నీ అత్యంత చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కనీసం సూపర్ 8 దశకు చేరకుండానే లీగ్ దశలోనే నిష్క్రమించింది. శ్రీలంక, బంగ్లాదేశ్ పై ఓడిపోయి ఊహించని రీతీలో టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. 

ఈ రెండు ప్రపంచ కప్ లు టీమిండియాకు పీడకలనే మిగిల్చాయి. అయితే ప్రస్తుత వరల్డ్ కప్ లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. స్థాయికి తగ్గట్టు ఆడితే కనీసం సెమీ ఫైనల్ కు సునాయాసంగా చేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన భారత్.. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.