దుబాయ్ : టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు బౌలర్లలో నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రాను వెనక్కునెట్టి సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఏడు వికెట్లు పడగొట్టడంతో పాటు కెరీర్లో 300 వికెట్ల మైలురాయి దాటిన రబాడ తన ర్యాంక్ పెంచుకున్నాడు.
మరోవైపు న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో బుమ్రా రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు.
బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ ఇండియా తరఫున అత్యధికంగా మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. రిషబ్ పంత్ 6 నుంచి 11వ స్థానానికి, విరాట్ కోహ్లీ 8 నుంచి 14వ స్థానానికి పడిపోయారు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా, అశ్విన్ టాప్2 ర్యాంక్‌లు నిలబెట్టుకున్నారు.