Women's Asia Cup: ఆసియా కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

Women's Asia Cup: ఆసియా కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

జూలై 19 నుంచి మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ జరగనుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరగనున్న ఈ టోర్నీ టీ20 ఫార్మాట్ లో జరగబోతుంది. ఈ మెగా టోర్నీ కోసం తాజాగా మహిళల సెలక్షన్ కమిటీ శనివారం (జూలై 6) 15 మందితో కూడిన భారత మహిళల జట్టును ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఇటీవలే సూపర్ ఫామ్ లో ఉన్న స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా కొనసాగుతుంది.

15 మందితో పాటు శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ ట్రావెలింగ్ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు గా ఎంపికయ్యారు. టోర్నమెంట్‌లో గ్రూప్ ఏ లో ఉన్న భారత్ టోర్నమెంట్‌లో తమ తొలి మ్యాచ్‌ను జూలై 19న పాకిస్థాన్‌తో ఆడనుంది. జూలై 21న యూఏఈ తో.. జూలై 23న నేపాల్‌తో తలపడుతుంది.  

ఆసియా కప్ 2024 భారత మహిళల జట్టు: 

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (డబ్ల్యుకె), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్

ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు:

శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్